బెంగుళూరు లోని ప్రోగ్రామర్, తేజేష్ ఎయిర్టెల్ నెట్వర్క్ పై 3G బ్రౌజింగ్ చేస్తుండగా కొన్ని అనుమానించదగ్గ కోడ్స్ ను ఎయిర్టెల్ బ్రౌజింగ్ సెషన్స్ లోకి ఇంజెక్ట్ చేస్తుంది అని తెలుసుకున్నాడు. అదే సోర్స్ కోడ్ ను Github అనే ఓపెన్ సోర్స్ కోడింగ్ ప్లాట్ఫారం లో పోస్ట్ చేయగా, ఎయిర్టెల్ ఎరిక్సన్ టై అప్ అయి ఒక ఇజ్రాయిల్ కంపెని, 'ఫ్లాష్ నెట్వర్క్స్' ని బ్రౌజింగ్ సెషన్స్ లోకి కోడ్ ను పెట్టడానికి నియమించుకుంది అనే విషయం బయట పడింది.
అవును మీరు చదువుతున్నది నిజమే, ఇదంతా ఎయిర్టెల్ వినియోగదారులకి తెలియకుండా జరుగుతుంది. అయితే ఆసక్తికరంగా ఫ్లాష్ నెట్వర్క్స్ కంపెని, ఈ విషయాన్ని కనుగొన్న తేజేష్ పై నోటిస్ లు జారి చేసింది. తమ యాజమాన్యం లో ఉన్న కోడ్స్ ను Github లో పెట్టినందుకు cease నోటిసులు పంపింది అతనికి. అయితే ఇంతవరకూ ఎయిర్టెల్ ఎందుకు ఆ కోడ్స్ ను ఉపయోగిస్తుంది అనే అసలు విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.
రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే, ఫ్లాష్ నెట్వర్క్ అనే కంపెని ద్వారా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు యూజర్స్ కు అంతరాయం కలిగించి మరీ బ్రౌజింగ్ సెషన్స్ లో వాళ్ల సొంత ఎడ్వర్టైజ్మెంట్స్ ను జోడిస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు. మరో పక్క అనేక పబ్లికేశన్స్ నుండి ఇండియన్ సిటిజెన్ ను ఒక ఇజ్రాయిల్ కంపెని నిజాన్ని బయట పెట్టినందుకు నోటిసులు పంపడం పై మాట్లాడుతున్నారు.
అయితే ఈ మొత్తం ఉదంతం పై ఎయిర్టెల్ "కోడ్ విషయం అనేది వాస్తవమే కాని దానిని మేము ఎటువంట చట్ట వ్యతిరేక పనులకు ఉపయోగించటంలేదు" అని ఒప్పుకుంది. ఎయిర్టెల్ ఇచ్చిన స్టేట్మెంట్..
"ఇది ఒక టెలికాం లో గ్లోబల్ గా ఉండే స్టాండర్డ్ రూల్స్. కస్టమర్ డేటా యూసేజ్ ను ట్రాక్ చేసి, వాళ్ల వినియోగాన్ని మరింత మెరుగపరచటానికి మరియు మేనేజ్ చేయటానికి వాడుతున్న కోడ్ మాత్రమే. వినియోగదారుని ప్రైవెసీ మాకు చాలా ముఖ్యం. కాని ఫ్లాష్ నెట్వర్క్స్ తేజేష్ పై నోటిసు పంపడం మాకు ఆశ్చర్యంగా ఉంది. కాని కేటగరికల్లీ మాకు దానితో ఎటువంటి సంబంధం లేదు" అని చెప్పింది ఎయిర్టెల్.
తరువాతి రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఎయిర్టెల్ తో పాటు వోడాఫోన్ కూడా ఫ్లాష్ నెట్వర్క్స్ తో ఒప్పొండం కుదుర్చుకుంది. అయితే దీని పై ఇంకా స్పష్టత రాలేదు.