Acer ZX 5g phone launched under budget price in India
చాలా రోజులుగా కొత్త ఫోన్ గురించి లాంచ్ చేస్తున్న ఏసర్ ఈరోజు ఎట్టకేలకు కొత్త ఫోన్ లను విడుదల చేసింది. ఏసర్ ఈరోజు Acer ZX సిరీస్ ను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ సిరీస్ నుంచి Acer ZX 5G స్మార్ట్ ఫోన్ చవక ధరలో ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ తో అందించింది. ఏసర్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ZX ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
ఏసర్ ఈ ఫోన్ ను 5 వేరియంట్స్ లో అందించింది. ఇందులో బేసిక్ వేరియంట్ (4GB + 64GB) ను రూ. x,x90 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ వేరియంట్స్ ను మాత్రం వెల్లడించింది. రెండవ (4GB +128GB) వేరియంట్, మూడవ (6GB +128GB) వేరియంట్, నాల్గవ (8GB + 128GB) వేరియంట్ మరియు (8GB + 256GB) వేరియంట్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది.
బడ్జెట్ యూజర్ కు 5జి ఫోన్ అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అందించినట్లు ఏసర్ తెలిపింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సాల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Motorola Edge 60 Stylus: బడ్జెట్ స్టైలస్ ఫోన్ వచ్చేసింది..ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఏసర్ ఈ కొత్త ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఏసర్ లేటెస్ట్ 5జి ఫోన్ 6.78 ఇంచ్ ఇన్ సెల్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
ఈ ఏసర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 64MP Sony IMX682 మెయిన్ కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మ్యాక్రో కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది.
ఏసర్ జెడ్X 5జి స్మార్ట్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 OS పై పని చేస్తుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ SIM సపోర్ట్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 33W PD ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఏసర్ స్మార్ట్ ఫోన్ IP 50 రేటింగ్ తో డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.