Acer Upcoming స్మార్ట్ ఫోన్ టీజర్ విడుదల చేసింది: ఫోన్ ఎలా ఉందంటే.!

Acer Upcoming స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ రిలీజ్ చేసింది
అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటి నుంచే టీజింగ్ మొదలు పెట్టింది
ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తెలిపేలా చేసే ఇమేజెస్ తో టీజింగ్ స్పీడ్ ను పెంచింది
Acer Upcoming స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ రిలీజ్ చేసింది. ఏసర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటి నుంచే టీజింగ్ మొదలు పెట్టింది. వాస్తవానికి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తెలిపేలా చేసే ఇమేజెస్ తో టీజింగ్ స్పీడ్ ను పెంచింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో చూసేద్దామా.
Acer Upcoming స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఏసర్ లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ టీజింగ్ ను మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ యొక్క పేరు లేదా లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ కలిగి ఉంటుందో మాత్రం టీజర్ వెల్లడిస్తోంది.
Acer Upcoming స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది?
ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ మైక్రో సైట్ పేజి అందించింది. ఈ టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చే ఇమేజెస్ తో టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ ప్రకారం, ది నెక్స్ట్ హారిజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ వెనుక పెద్ద రౌండ్ బంప్ డిజైన్ లో కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ చాలా వేగంగా పనిచేసే చిప్ సెట్ కలిగి ఉంటుందని ఏసర్ చెబుతోంది.
ఈ ఫోన్ కెమెరా గురించి కూడా హింట్ అందించింది. ఈ అప్ కమింగ్ ఏసర్ ఫోన్ లో AI సపోర్ట్ కలిగిన గొప్ప కెమెరా సిస్టం ఉంటుందట. టీజర్ ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్ లో టెలిఫోటో కెమెరా ఉండే ఆస్కారం ఉండవచ్చు. ఈ ఫోన్ లో బిగ్ బి బ్యాటరీ ఉంటుందని కూడా ఏసర్ టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ గొప్ప విజువల్స్ అందించే బెస్ట్ స్క్రీన్ మరియు చాలా తక్కువ అంచులు కలిగి స్టన్నింగ్ డిజైన్ తో ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఏసర్ టీజ్ చేస్తోంది.
Also Read: CMF Phone 2 టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ.!
ఈ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే ఏసర్ లాంచ్ చేయనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.