ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఎక్కువ కెమెరాలను ఫోన్లలో అందించాడన్ని ట్రెండుగా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, ముందుగా డ్యూయల్ కెమెరాలతో మొదలుపెట్టి, ఇప్పుడు అధిక సంఖ్యలో కేమెరాలను తీసుకువస్తున్నాయి వాటి ఫోన్లలో. ఇప్పుడు కొత్తగా LG పేటెంట్స్ చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. ఎందుకంటే లెట్స్ గో డిజిటల్, యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ (USPTO) మంజూరు చేసిన ఒక పేటెంట్ను కనుగొన్నది. ఈ పేటెంట్, వెనుక భాగంలో వేర్వేరు ఫోకాల్ లెంగ్తులు కలిగిన ఒక 16 లెన్సులు కలిగిన ఒక ఫోన్ గురించి చెబుతోంది.
ఒక ఫోనులో 16 కెమెరాలను కలిగిఉండడం కొంచెం అతిగా అనిపించినా, ఈ LG పేటెంట్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను కలిగివుంది. ఈ నివేదిక ప్రకారం, ఈ 16 కెమేరాలు కూడా ఒకేసారి ఇమేజిని చిత్రిస్తాయి, కానీ అన్నీకూడా వేర్వేరు కోణాలలో చిత్రిస్తాయి. సిదంతపరంగా చూస్తే, భిన్నకోణాలతో తీసిన ఈ ఇమేజిలను అన్నింటిని కలిపి ఒక కదిలే ఇమేజిగా సృష్టించవచ్చు. ఇక్కడ అన్ని కెమేరాలు కలిసి పనిచేస్తాయి కాబట్టి, గొప్ప డెప్త్ క్లారిటీ కలిగిన చిత్రాలను పొందేవీలుంది.
అదనంగా, LG ఈ 16 కెమెరాలతో పాటుగా వెనుక వైపున ఒక అద్దాన్ని అమరుస్తుంది. దీని సహాయంతో, వినియోగదారులు అధిక క్వాలిటీ ఫోటోలను తీసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. LG, ఈ ఫోన్ ముందుభాగంలో ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడంకోసం, కేవలం ఒకే కేమేరాని అందించవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, LG కేవలం పేటెంటును మాత్రమే పొందింది, తన డివైజ్లలో దీనిని కచ్చితంగా వాడాలని ఎటువంటి నిభందనలేదు.