Xiaomi ఈ రోజు ఇండియాలో Mi Max లార్జ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ప్రెస్ 14,999రూ. జులై 6 నుండి Mi.com లో మొదటి flash సేల్స్ స్టార్ట్.
ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్స్ ఓపెన్. మిగిలిన రెగులర్ వెబ్ సైట్స్ లో ఇదే ఫోన్ ఓపెన్ సేల్స్ లో సెల్ అవనుంది జులై 13 నుండి. ఫోన్ లో హైలైట్ స్క్రీన్ సైజ్.
స్పెక్స్ – హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్, 4G LTE with VoLTE సపోర్ట్, 6.44 in FHD 342ppi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 650 SoC, 3GB రామ్, Infrared emitter for యూనివెర్సల్ రిమోట్ ఫంక్షన్.
32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డు సపోర్ట్, 16MP రేర్ కెమెరా అండ్ 5MP front కెమెరా, bluetooth 4.1, 4850mah బ్యాటరీ తో దీని బరువు 203గ్రా, మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్.
ఫోన్ తో పాటు 3 నెలలు free మూవీస్ అండ్ 1ఇయర్ unlimited Hungama Play మ్యూజిక్ ఇస్తుంది. అయితే ఇది Mi Max , Mi 5, రెడ్మి నోట్ 3 కొన్న మొదటి 1 మిలియన్ buyers కు మాత్రమే.
ఈ రోజే ఇండియాలో MIUI 8 కూడా రిలీజ్ చేసింది. ఈ పబ్లిక్ బీటా జులై 11 నుండి OTA update ద్వారా అన్ని ఫోనుల్లో వస్తుంది అని తెలిపింది కంపెనీ. స్టేబుల్ వెర్షన్ ఆగస్టు 16 న వస్తుంది.
చైనాలో ఇదే ఫోన్ స్నాప్ డ్రాగన్ 652 SoC, 4GB రామ్, 128gb స్టోరేజ్ వేరియంట్ తో కూడా రిలీజ్ అయ్యింది. దీని ప్రెస్ 19,999రూ. ఇది కూడా కంపెనీ ఇండియాలో త్వరలో రిలీజ్ చేస్తుంది అని చెబుతుంది.