6 ఏళ్ల బాలుడి చేతిలో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ మంటలతో పేలిపోయింది
UPDATE: ఇంట్లోని సభ్యులు ముందు చెప్పిన మాటలు ప్రకారం ఫోన్ గేలక్సీ నోట్7 కాని తరువాత బాలుడి తల్లి ఫోన్ సామ్సంగ్ కోర్ prime మోడల్ అని తెలిపారు.
మొదటిగా వ్రాసిన ఆర్టికల్..
సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్, 6 ఏళ్ల బాలుడి చేతిలో పేలిపోయింది. ఈ సంఘటన న్యూయార్క్ నగరంలోని Brooklyn లో చోటు చేసుకుంది.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం పిల్లడు కాలిన గాయాలతో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళ సమాచారం ప్రకారం..బాబు ఫోనులో వీడియోస్ చూస్తండగా..
సడెన్ గా ఫోన్ మంటలతో కాలిపోవటం మొదలయ్యింది. ఇప్పుడు బాబు ఫోన్ చూడటానికి…ముట్టుకోవటానికి కూడా భయపడుతున్నట్లు చెబుతున్నారు ఇంట్లోని సభ్యులు.
దీనికి సంబంధించి ఫ్యామిలీ సామ్సంగ్ తో మాట్లాడుతుంది. అయితే ఆల్రెడీ కంపెని ప్రపంచవ్యాప్తంగా గాలక్సీ నోట్ 7 వాడుతున్న వినియోగదారులందరినీ తిరిగి ఇచ్చేమని కోరటం జరిగింది. ఫ్రీ రీప్లేస్మెంట్ ఇస్తుంది.( కంప్లీట్ సమాచారం ఈ లింక్ లో.)
ఇప్పటివరకూ US లో ఎక్కువుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇండియన్ సేల్స్ కూడా delay చేసింది సామ్సంగ్. ఇండియన్ ఏవియేషన్ అధారిటీస్ కూడా ఈ ఫోన్ ను ఫ్లైట్ లో వాడకూడదు అని తెలిపారు.
ఈ నేపధ్యంలో కంపెని ఇతర కారణాలతో పాటు టోటల్ గా 19$ బిలియన్స్ మార్కెట్ వేల్యూ ను కోల్పోవడం జరిగింది.