గత వారం మైక్రోమ్యాక్స్ డూడుల్ 4 పై ఒక టిసర్ ను విడుదల చేసింది, కాని దాని అధికారిక అనౌన్సుమెంటు చేయటం కాని ఇండియన్ వెబ్సైటు లో పెట్టడం కాని చేయలేదు మైక్రోమ్యాక్స్.
అయితే తాజాగా ఇప్పుడు ముంబాయి లోని మహేష్ టెలికాం కాన్వాస్ డూడుల్ 4 గురించి వివరాలను వెల్లడించారు. ఫోన్ ధర రూ. 9,499 అని చెప్పారు. 6 ఇంచ్ HD(720×1280 ) డిస్ప్లే కాన్వాస్ డూడుల్ 4 లో ఉన్నాయి. 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0, 8MP రేర్ (వెనుక) కెమేరా మరియు 2MP ఫ్రంట్ కెమేరా, 1జిబి ర్యామ్, 8 జిబి ఇన్ బిల్ట్ మెమరి, 3000mah బ్యాటరీ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 లోని స్పెక్స్. అఫ్కోర్స్ ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఈ మోడల్ డ్యూయల్ సిమ్ , డ్యూయల్ స్టాండ్ బై లో వస్తుంది.
కాన్వాస్ డూడుల్ 4 Q391 డూడుల్ సిరిస్ లో నాలుగవ మోడల్. వరసుగా నాలుగు మోడల్స్ కంపెని దించిందంటే, దాని సక్సెస్ రేంజ్ బాగుంది అని మనకు తెలుస్తుంది.
మైక్రోమ్యాక్స్ వరసుగా మార్కెట్లోకి కొత్త మోడల్స్ ను దింపుతుంది. తాజగా యు సిరిస్ యుఫోరియా పేరుతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది, దీనితో పాటు యు ఫిట్ అనే ఫిట్నెస్ బాండ్ మరియు యు హెల్త్ అనే రెండు డివైజ్ లను కూడా లాంచ్ చేసింది. ఇవి అమెజాన్ లో కొనుకోవచ్చు. యు డివైజెస్ గురించి అధిక సమాచారం కొరకు ఇక్కడ చూడగలరు. యు యుఫోరియా గురించి పూర్తి రివ్యూ ఇక్కడ పొందండి.