digit zero1 awards

ధమాకా ఆఫర్: 25 వేలకే 50 ఇంచ్ Smart Tv అందుకోండి.!

ధమాకా ఆఫర్: 25 వేలకే 50 ఇంచ్ Smart Tv అందుకోండి.!
HIGHLIGHTS

పెద్ద Smart Tv కొనాలనుకునే వారికి ఈరోజు గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది

50 ఇంచ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది

ఈరోజు Flipkart ఈ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ధమాకా ఆఫర్: చౌక ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈరోజు గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ జర్మన్ బ్రాండ్ బ్లూపంక్ట్ సరికొత్తగా తీసుకొచ్చిన 50 ఇంచ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

Smart Tv Offer

జర్మన్ బ్రాండ్ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ పైన ఈరోజు Flipkart ఈ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు చవక ధరకే లభిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

Blaupunkt CyberSound G2 Smart TV
Blaupunkt CyberSound G2 Smart TV

ఇక ఈ ఆఫర్ విషయానికి వస్తే, Blaupunkt CyberSound G2 Series నుండి లాంఛ్ చేసిన 50 ఇంచ్ UHD (4K) గూగుల్ స్మార్ట్ టీవీ 2023 సిరీస్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 38% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అలాగే, HSBC Bank Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,750 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకే అందుకునే అవకాశం వుంది.

Also Read: Microsoft కొత్త VASA-1 AI టెక్ తో మాములు ఫోటో అవుతుంది మాట్లాడే ఫోటో.!

Blaupunkt CyberSound G2: ప్రత్యేకతలు

బ్లూపంక్ట్ యొక్క ఈ బిగ్ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ సన్నని అంచులు కలిగి స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంది. ఈ టీవీ లో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ 60W హెవీ సౌండ్ అందించ గల స్పీకర్లను మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo