రిపోర్ట్స్ ప్రకారం Xiaomi తన తదుపరి మి 5 మోడల్ పై స్నాప్ డ్రాగన్ 820 క్వాల్ కామ్ ప్రాసెసర్ మరియు 4 జిబి ర్యామ్ ను వాడనుంది.
ITI68 అనే చైనా వెబ్ సైటు ప్రకారం Xiaomi మి 5 2015, నవంబర్ లో రిలీజ్ కానుంది. మి 5 లో జోడించిన స్పెసిఫికేషన్స్ – క్వాల్కం స్నాప్ డ్రాగన్ 820 SoC, 4 జిబి ర్యామ్, 16/64 జిబి బిల్ట్ ఇన్ స్టోరేజ్, 5.5 QHD ( క్వాడ్ HD – నాలుగు రెట్లు HD క్వాలిటీ ) 1440×2560 రిసల్యుషణ్, ఫిసికల్ బటన్ అవసరం లేని ఫింగర్ ప్రింట్ స్కానర్, 16MP రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, usb టైప్ C కనేక్టార్ 3000mah బ్యాటరీ.
హాండ్ సెట్ పూర్తిగా అల్యూమినియం తో తయారు కానుంది. మరియు 5.1 mm తిన్ నేస తో అతి స్లిమ్ డివైజ్ గా డిజైన్ చేయబడింది. గతంలో Xiaomi మి 5 ప్లస్ పేరుతొ ఒక ఫెబ్లేట్ కూడా తయారు చేస్తుంది అని సమాచారం వచ్చింది. అయితే దిని స్పెసిఫికేషన్స్ – 6 in QHD బెజేల్ లెస్ (ఫోన్ రైట్ మరియు లెఫ్ట్ సైడ్స్ లో స్క్రీన్ కి బోర్డర్ ఏమి ఉండదు) డిస్ప్లే, 4 జిబి ర్యామ్, 32 జిబి ఇన్బిల్ట్ స్టోరేజ్, 16MP బ్యాక్ కెమేరా. అయితే రూమర్స్ ప్రకారం మి 5 తో పాటు మి 5 ప్లస్ ను కూడా రిలీజ్ చేయనుంది Xiaomi. ఈ రెండు ఫోను లతో పాటు Xiaomi మి 4S అనే మోడల్ ను రిలీజ్ చేయనుంది. దీని ప్రత్యేకతలు – స్నాప్ డ్రాగన్ 810 SoC, 13MP కెమేరా, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్. ఇది జులై, 2015 లో లాంచ్ అవనుంది.
తాజాగా Xiaomi మి 4i పేరుతో 12,999 రూ. లకు ఏప్రిల్ లో ఒక స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ – 5 in FHD(ఫుల్ HD) డిస్ప్లే, లాలిపాప్ ఆధారిత MIUI 6, మరియు తెలుగు, కన్నడ, హిందీ లాంగ్వేజస్ సపోర్ట్. స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ 64 బిట్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 13MP ప్రైమరీ కెమేరా, డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై, 4జి, 3జి, బ్లూటూత్ 4.1 మరియు 3120 mah బ్యాటరీ.
ఆధారం: ఫోన్ ఏరేనా, మొబైల్ డాడ్