Xiaomi నుండి ఒక మిస్టరీ ఫోన్ కనిపించింది చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్, Weibo లో. దీని డిస్ప్లే సైజ్ 4.3 in ఉంది. సో ఇది ఐ ఫోన్ రీసెంట్ రిలీజ్ SE కు కాంపిటేషన్ ఇవ్వటానికి వస్తుందా?
దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820SoC, 3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, HD డిస్ప్లే, 13MP సోనీ IMX258 ఇమేజ్ సెన్సార్ ఉండనున్నాయని అని రిపోర్ట్స్.
ఇది కంపెని మార్చ్ 31 న ఇండియాలో రిలీజ్ చేయనున్న Xiaomi Mi 5 లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ కు చిన్న మోడల్ లా అనిపిస్తుంది. దాదాపు సిమిలర్ స్పెక్స్ కాని చిన్న సైజ్ స్క్రీన్.
అయితే కంపెని మాత్రం ఇప్పటివరకు Mi 5 మిని మోడల్ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించలేదు ఎక్కడా. కంపెని Mi 5 తో పాటు Mi 5 pro ను కూడా ఇండియాలో లాంచ్ చేస్తుంది ఏమో అని అంచనా.
Mi 5 ప్రో లో higher clock స్పీడ్ SD 820 ప్రొసెసర్, 4GB ర్యామ్, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ మాత్రమే అదనంగా ఉన్న మార్పులు. మిగిలినవన్నీ సేమ్ Mi 5 స్పెక్స్.