గూగల్ నుండి త్వరలోనే 2000 రూ లలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులు రానున్నాయి అని తెలుస్తుంది. కంపెని ceo సుందర్ పిచై ఈ విషయాన్ని రీసెంట్ గా ఇండియాకు విజిట్ చేసిన సమయంలో ఇండియన్ మార్కెట్ లో 2వేలుకు ఫోనులు రావాలి అని వెల్లడించారు. ఆల్రెడీ గూగల్ 2014 లో వివిధ ఇండియన్ కంపెనీలతో జతకలిసి android one అనే పేరుతో minimum 5000 రూ బడ్జెట్ లో ఫోనులు లాంచ్ చేసింది. అయితే మొదటి దశలో కొంతమేరకు ఇవి సక్సెస్ అయినప్పటికీ తరువాత దశలో లాంచ్ అయిన అప్ గ్రేడ్ మోడల్స్ అంతగా సక్సెస్ ను అందుకోలేకపోయాయి. సో ఇప్పుడు 2000 రూ ఫోనుల ప్రయత్నం ఎంతమేరకు consumers ను మెప్పిస్తాయో చూడాలి. ఇది ఇలా ఉంటే భారత ప్రభుత్వం కూడా ఇండియన్ మొబైల్ కంపెనీలకు ఫింగర్ ప్రింట్ స్కానర్, QR code స్కానింగ్ వంటి ఫీచర్స్ తో 2వేల రూ ఫోనులు తయారు చేయమని సూచనలు ఇచ్చింది.