Xiaomi Mi Notebook Air ని గత ఏడాది జూలై లో ప్రవేశ పెట్టింది . మరియు ఇప్పుడు ఒక తాజా లీక్ లో కంపెనీ త్వరలో దీని కొత్త వేరియంట్ ప్రవేశ పెట్టబోతోంది. ఇది 7th జనరేషన్ ఇంటెల్ ప్రోసెసర్ వస్తుంది . ఈ డివైస్ ప్రెస్ రెండర్ తో లీక్ అవుతుంది మరియు దీని ఫుల్ స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి . ఈ కొత్త లాప్టాప్ యొక్క డిసైన్ ఓల్డ్ వేరియంట్ లానే ఉంటుంది కానీ కొత్త వేరియంట్ లో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు
ఈ కొత్త నోట్ బుక్ ఎయిర్ లో Mi Notebook Air లో కొత్త 7th జనరేషన్ ఇంటెల్ కోర్ i5-7200U ప్రోసెసర్ కలదు. దీని బేస్ క్లాక్ స్పీడ్ 2.5GHz మరియు దీని మాక్స్ క్లాక్ స్పీడ్ 3.1GHz ఉంటుంది . మరియు దీనిలో 8GB రామ్ మరియు 128GB అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ కలవు .
ఈ కొత్త xiaomi Mi Notebook లో బ్లూటూత్ 4.0, వైఫై మరియు ఒక సిమ్ కార్డు స్లాట్ కూడా కలదు. దీనిలో 4- సెల్ బ్యాటరీ కూడా కలదు , వాదనల ప్రకారం 9.5 గంటల రన్ టైం ఇస్తుంది . ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో USB టైపు -C స్లాట్ కూడా కలదు.