త్వరలో తీసుకురానున్న షావోమి ల్యాప్ టాప్ ని అధికారికంగా Mi Notebook Horizon Edition అనే పేరును ప్రకటించింది మరియు జూన్ 11 న లాంచ్ అవుతుంది. షావోమి ఇండియా VP మనూ కుమార్ జైన్ ట్విట్టర్ పోస్ట్లో ఈ పేరు వెల్లడించారు. ఈ పేరును గమనిస్తే, షావోమి ముందుగా వాగ్దానం చేసినట్లు, ఇది ఎక్కడా విడుదల చేయని ఒక కొత్త ల్యాప్టాప్ అని సూచిస్తుంది.
రిటైల్ బాక్స్ యొక్క చిత్రం రాబోయే ఈ ల్యాప్ టాప్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా వెల్లడిస్తుంది. ఈ రిటైల్ బాక్స్ లోని టెక్స్ట్ ఈ ఫోటోలలో స్పష్టంగా లేనప్పటికీ (108MP కెమెరాతో Mi 10 5G లో చిత్రాన్ని తీసినప్పటికీ;) మేము కొన్ని ముఖ్య లక్షణాలను ట్రాక్ చేయగలిగాము. ఇందులో, సన్నని బెజల్స్(అంచులు), విండోస్ హలో సపోర్ట్, ఒక SSD డ్రైవ్, DTS Surround Sound మరియు Anti Virus ప్రొటెక్షన్ ఉన్నాయి.
టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ కూడా కొన్ని స్పెక్స్ (ప్రత్యేకతలు) స్పష్టంగా చేశాడు. తన ట్వీట్ ప్రకారం, ఈ Mi Notebook Horizon Edition 14-అంగుళాల బెజెల్ -లెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. దీనికి, షావోమి హారిజోన్ ఎడ్జ్ డిస్ప్లే అని పేరును పెట్టింది. ఈ నోట్ బుక్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 10 గంటలు పనిచేస్తుంది మరియు DTS ఆడియోకు మద్దతు ఇస్తుంది. ఈ బోర్డులో ఒక SSD(సాలీడ్ స్టేట్ డ్రైవ్) కూడా ఉంటుంది, కానీ ఖచ్చితమైన కాన్ఫిగరేషన్లు ఇంకా తెలియవు.
జూన్ 11 న ప్రకటించనున్నది ఈ ల్యాప్ టాప్ మాత్రమే కాదు. నివేదికల ప్రకారం, మార్కెట్ నాడిని పట్టుకోవటానికి షావోమి ఇతర మోడళ్లను వివిధ ధరల విభాగాలలో విడుదల చేయవచ్చు. మునుపటి నివేదికలు 'Made For India' ల్యాప్ టాప్స్ అనేవి, ఇటీవల చైనాలో ప్రారంభించిన Redmi Book లైనప్ తప్ప మరేమీ కాదు, వీటిని రీబ్రాండెడ్ చేయనున్నారు అని తెలిపాయి. షావోమి ఇంతకు ముందు స్మార్ట్ ఫోన్ల తో ఈ విధానాన్ని అవలంభించింది. ఇటీవల ఇదేవిధంగా Redmi K 30 ఇండియాలో Poco X 2 గా రీబ్రాండ్ చేయబడింది. టిప్స్టర్ క్లెయిమ్ చేసిన 10-గంటల బ్యాటరీ లైఫ్ మినహా, అన్ని ఫీచర్లు కూడా రెడ్మిబుక్ 14 లైనప్ తో సరిపోలుతాయి.