సామ్సంగ్ తీసుకున్న పేటెంట్ లో రెండు కంపోనేన్ట్స్ ఉన్నాయి. మొదటిది, ఆండ్రాయిడ్ పై పనిచేసే ఫెబ్లేట్(పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్). రెండవది, నోట్ బుక్ లో ఫెబ్లేట్ ను పెట్టుకోవటానికి ఫెబ్లేట్ డాక్. అంతే కాదు ఈ కొత్త పేటెంట్ డివైజ్ విండోస్ మరియు ఆండ్రాయిడ్ ఓస్ లకు ఇంటర్చేంజ్ అవగలదు.
అయితే వీటితో పాటు సామ్సంగ్ సొంత టైజెన్ ఓస్ ను కూడా ఇది సపోర్ట్ చేసే అవకాసం ఉంది. పేటెంట్ లో డివైజ్ స్పెసిఫికేషన్స్ ఏమీ వెల్లడించలేదు. ఆండ్రాయిడ్, టైజెన్ ఫెబ్లేట్ పై పనిచేయగా, విండోస్ నోట్ బుక్ పై పనిచేయనుంది. ఈ కొత్త పేటెంట్ వినటానికి కొంచెం ఇంటరెస్టింగ్ హైబ్రిడ్ డివైజ్ లా ఉంది. స్మార్ట్ ఫోన్/ ఫెబ్లేట్ మరియు నోట్ బుక్ ను కలిపే ఈ పేటెంట్ ఎంతవరకూ సక్సెస్ అవనుందో వేచి చూడాలి. టెక్నాలజీ యూజర్ కు ఒకే దగ్గర వివిధ టెక్నాలజీ అవసరాలను తీర్చే విధంగా సామ్సంగ్ ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మంచి మార్కెట్ తో లాభాలలో ఉన్న ఆపిల్ మరియు గూగల్ నుండి పోటీ తట్టుకొవటానికి సామ్సంగ్ ఈ విధమైన పేటెంట్ ను తెస్తుంది.
గూగల్ కూడా ఇదే విధముగా ఒక కొత్త పేటెంట్ ను తెచ్చుకుంది. ఆడుకునే టాయ్స్ లో స్మార్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటి ను తీసుకురానుంది గూగల్. మనుషుల చెప్పే కమేన్డ్స్ మరియు ఇన్స్ట్రక్షన్స్ ను ఇది విని ఇచ్చిన కమాండ్ బాట్టి తిరిగి టాస్క్ ను పూర్తి చేయనున్నాయి ఈ స్మార్ట్ టాయ్స్. ఉదాహరణకు ఒక సింపుల్ వాయిస్ కమాండ్ ద్వారా ఇంటిలో లైట్స్ లేదా హౌస్ హోల్డ్ పనులను చేయటకు ఇది ఉపయోగపదతుంది. దీనిపై గూగల్ విడియో కూడా రిలీజ్ చేసింది. కింద చూడగలరు.
ఆధారం: సామ్సంగ్ మొబైల్