రిలయన్స్ చవక ధరలో ల్యాప్ ట్యాప్ లాంచ్ చేసి మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. JioBook 11(2023) పేరుతో అతితక్కువ ధరలో ఈ ల్యాప్ టాప్ ను భారతీయ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ల్యాప్ టాప్ Reliance Digital నుండి సేల్ కి అందుబాటులో కూడా ఉంచింది. ఈ ల్యాప్ టాప్ JioOS పైన పని చేస్తుంది మరియు 4G VoLTE సపోర్ట్, HD డిస్ప్లే మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ జియోబుక్ 11(2023) కంప్లీట్ ఇన్ఫర్మేన్షన్ తెలుసుకుందాం పదండి.
రిలయన్స్ ఈ JioBook 11(2023) ను రూ. 16,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ల్యాప్ టాప్ పైన అతితక్కువ EMI అఫర్ ను కూడా రిలయన్స్ జత చేసింది. ఈరోజు నుండి ఈ JioBook 11(2023) ను రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ ద్వారా Pre-Order కోసం అందుబాటులో వుంది.
రిలయన్స్ యొక్క ఈ ల్యాప్ టాప్ 11.6 ఇంచ్ HD డిస్ప్లేని కలిగి వుంది. జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం 900 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉండేలా డిజైన్ చేసింది మరియు చాలా స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ జియోబుక్ 11 మీడియాటెక్ MT8788 (2.0 GHz) ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో 4GB LPDDR4 ర్యామ్ మరియు 64GB eMMC ఇంటర్నల్ స్టోరేజ్ అందుతాయి. అయితే, మీరు కోరుకుంటే ఈ మెమోరిని 256GB వరకూ పెంచుకోవచ్చు.
ఈ జియో ల్యాప్ టాప్ 4G LTE మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సప్పర్ట్ తో Always On ఇంటర్నెట్ తో వస్తుంది. రిలయన్స్ ఈ ల్యాప్ టాప్ ని JioOS తో అందించింది మరియు మల్టీ విండో సపోర్ట్ తో మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. ఇందులో పెద్ద ట్రాక్ ప్యాడ్ కలిగిన ఇన్ఫినిటీ కీబోర్డు, 2MP HD వెబ్ క్యామ్, వైర్ లెస్ ప్రింటింగ్, స్టీరియో స్పీకర్లు, 8 గంటలు పని చేయగల లిథియం అయాన్ బ్యాటరీ, MiniHDMI మరియు BT 5.0 సపోర్ట్ వంటి ప్రత్యేకతలతో ఈ జియో ల్యాప్ టాప్ ఉంటుంది.