విండోస్ మరియు ఆపిల్ మాక్ కంప్యూటర్స్ పై రన్ అయ్యే మరొక కొత్త ఆపరేటింగ్ సిస్టం మార్కెట్ లోకి వచ్చింది. ఇది ఫ్రీ గా x86 based డెస్క్ టాప్స్ పై ఇంస్టాల్ చేసుకోగలరు. ఇది Raspberry Pi(atm కార్డ్ సైజ్ లో ఉండే cpu/కంపూటర్స్ లను తయారు చేస్తుంది) సొంతంగా తయారు చేసిన OS.
పైన ఉన్న ఇమేజే Raspberry Pi డివైజ్ ది. ప్రస్తుతానికి ఇంకా బీటా స్టేజి లో ఉన్నట్లు తెలుస్తుంది. bootable dvd లేదా USB పెన్ డ్రైవ్ లో కూడా burn చేసి డెస్క్ టాప్ లో ఇంస్టాల్ చేయగలరు.
Debian Linux ఓపెన్ సోర్స్ OS అయిన దీని పేరు Pixel. 1GB OS ISO ఇమేజ్ ఫైల్ క్రింద తెలిపిన లింక్ లో డౌన్లోడ్ చేయగలరు. క్లీన్ మోడరన్ యూసర్ ఇంటర్ఫేస్, chromium వెబ్ బ్రౌజర్, ఫ్రీ యాప్స్ ఉంటాయని తెలిపారు కంపెని బృందం.
దీనిపై మరింత సమాచారం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. అంటే ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇంస్టాల్ చేయాలి, మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి మరియు OS లో ఉండేవి ఏంటి అని తెలుసుకోగలరు.