4G LTE సిమ్ సపోర్ట్ తో Xiaomi నుండి రెండు కొత్త లాప్ టాప్స్ లాంచ్
Xiaomi ఇదే ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ అయిన Mi Notebook Air లాప్ టాప్ కు అప్ గ్రేడ్ మోడల్ రిలీజ్ చేసింది. అప్ గ్రేడ్ మోడల్ లో 4G LTE సిమ్ కనెక్షన్ ఉంది.
టోటల్ రెండు డిస్ప్లే వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది నోట్ బుక్ లాప్ టాప్. ఒకటి 12.5 in ఫుల్ HD డిస్ప్లే మరొకటి 13.3 in డిస్ప్లే మోడల్. మొదటి దాని ప్రైస్ సుమారు 47 వేలు, రెండవది 69 వేలు.
12.5 in Mi Notebook 4G స్పెక్స్ – ఇంటెల్ కోర్ M3 SoC, 4GB రామ్, 128GB SSD స్టోరేజ్, రెండవ SSD స్టోరేజ్ పెంచుకోవటానికి స్లాట్, డాల్బీ డిజిటల్ సౌండ్, 11.5 గం బ్యాక్ అప్.
13.3 in Mi Notebook 4G స్పెక్స్ – ఇంటెల్ కోర్ i7 ప్రొసెసర్, 8GB రామ్, 256GB SSD స్టోరేజ్, రెండవ SSD స్టోరేజ్ పెంచుకోవటానికి స్లాట్, 9.5 hours బ్యాటరీ లైఫ్.
రెండు మోడల్స్ లో 4G LTE సిమ్ కనెక్టివిటి సపోర్ట్ ఉంది. రెండూ విండోస్ 10 OS పై రన్ అవుతాయి. అయితే ఇవి ఇండియన్ మార్కెట్ లోకి వస్తాయా రావా అనేది ఇంకా తెలియదు.
మొన్న oneplus 3T మోడల్, ఇప్పుడు Mi notebook రిలీజ్ చూస్తుంటే చైనీస్ కంపెనీలు నెమ్మదిగా వన్ ఇయర్ అప్ గ్రేడ్ మోడల్ రిలీజ్ అనే పద్దతిని 6 నెలలకు కుదిస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పతివరకూ ఆపిల్ తో సహా అన్ని బ్రాండ్స్ ఏడాదికి ఒక అప్ గ్రేడ్ ఫోన్ మోడల్స్ రిలీజ్ చేయటమే జరుగుతుంది.