ఫోన్ తో పాటు జూలై 27 న లాప్ టాప్ కూడా లాంచ్ చేయనుంది Xiaomi అని మనం ఇంతకముందే చెప్పుకోవటం జరిగింది కదా. అయితే అలాగే కంపెని లాప్ టాప్ లాంచ్ చేసింది.
దీని పేరు Mi Notebook Air. రెడ్మి నోట్ pro తో పాటు చైనా లో లాంచ్ అయ్యింది నిన్న. windows 10 os పైనే నడుస్తుంది, MIUI తో రన్ అవుతుంది అని ఆశించకండి 🙂
ఇది కూడా రెండు స్క్రీన్ సైజెస్ లో వస్తుంది. ఒకటి 13.3 మరొకటి 12.5 inches. రెండింటికీ 1080P డిస్ప్లేలు మరియు backlit కీబోర్డ్స్ ఉన్నాయి. backlit అంటే keys చీకటిలో టైపింగ్ చేసుకునేలా lights తో వస్తాయి.
ఆపిల్ లాప్ టాప్స్ వలె..USB టైప్ C పోర్ట్ తో చార్జ్ అవుతాయి ఇవి. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో ఉంటున్నాయి. 13.3 in ప్రైస్ 50,000 రూ, 12.5 in ప్రైస్ 35,000 సుమారు.
13.3 in notebook 14.8mm thickness అండ్ 1.28KG బరువు ఉంటె, 12.5 in మోడల్ 12.9mm thickness అండ్ 1.07Kg బరువు మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి.
13.3 Mi Notebook Air లో ఇంటెల్ i5-6200U ప్రాసెసర్, Nvidia 1GB GDDR5 RAM GeForce 940MX GPU, 8GB DDR4 స్టాండర్డ్ రామ్, 256GB SSD స్టోరేజ్(నార్మల్ హార్డ్ డిస్క్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది file access)..
అందనంగా స్టోరేజ్ పెంచుకోవటానికి SATA స్లాట్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే కంపెని లెక్కలు ప్రకారం 9.5 hours వస్తుంది దీనిలోని 40Wh బ్యాటరీ.
12.5 in వేరియంట్ లో ఇంటెల్ కోర్ M3 ప్రొసెసర్ ఉండగా, స్టోరేజ్ 128GB SSD తో వస్తుంది. రామ్ 4GB. మిగిలిన వన్నీ same. ఇండియన్ మార్కెట్ కు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా తెలియవలసి ఉంది.