CES 2021: ఇంటెల్ 11-Gen ప్రొసెసర్లతో LG Gram సిరీస్ ల్యాప్ టాప్స్ వచ్చేశాయి
CES 2021 నుండి LG Gram Series లాప్ టాప్స్ ప్రకటన
LG Gram 2-in-1 సిరీస్ ను కూడా ప్రవేశపెట్టింది
CES 2021 కొత్త అప్డేట్స్
ప్రతి సంవత్సరం లాస్ వేగాస్ లో అట్టహాసంగా జరిగే కన్స్యూమర్ ఎలక్ష్ట్రానిక్స్ షో (CES), 2021 CES మాత్రం పూర్తి వర్చువల్ షో గా మారిపోయింది. అయితే , CES 2021 నుండి LG తన LG Gram Series లాప్ టాప్స్ కి రిఫ్రెష్ ప్రకటించి ఈ షో ని ముందుకు తీసుకెళ్లింది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్స్ సిరీస్ ను రిఫ్రెష్ చెయ్యడమే కాకుండా వీటి యొక్క 2-ఇన్-వన్ సిరీస్ ను కూడా ప్రవేశపెట్టింది.
LG Gram (రిఫ్రెష్) ప్రత్యేకతలు
పునరుద్ధరించబదిన LG Gram ఇప్పడు 14,16 మరియు 17 అంగుళాల మోడళ్లలో కూడా వస్తుంది. వీటి డిస్ప్లే విషయానికి వస్తే, 14 ఇంచుల LG Gram డిస్ప్లే పరంగా 1920×1200 రిజల్యూషన్ కలిగి ఉండగా, మిగిలిన పెద్ద మోడళ్ళు 2560×1600 రిజల్యూషన్ కలిగి ఉంటాయి. అయితే, ఈ మోడళ్ల డిస్ప్లేలు కూడా 99 శాతం DCI-P కలర్ స్పేస్ ను కవర్ చేయగలవాని LG పేర్కొంది. ఇక బరువు విషయంలో కూడా చాలా తక్కువ బరువుతో ఉంటాయి. వీటిలో, 14 అంగుళాల LG Gram ఒక కిలో కంటే తక్కువ బరువు (999 గ్రా) ఉండగా, 16అంగుళాల మోడల్ 1190 గ్రాములతో, 17 అంగుళాల మోడల్ 1350 గ్రాముల తక్కువ బరువుతో ఉంటాయి.
ఈ మూడు LG Gram వేరియంట్స్ కూడా Xe గ్రాఫిక్స్ కలిగిన Intel యొక్క 11 వ తరం ప్రొసెసర్లు మరియు 8GB మరియు 16GB స్టోరేజీలకు మద్దతునిస్తాయి. అలాగే, ఈఆ వేరియంట్స్ అన్ని కూడా m.2 NVMe డ్రైవ్ మరియు USB4/ThunderBolt 4 పోర్టులతో వస్తాయి.
LG Gram 2-in-1 ప్రత్యేకతలు
LG ఈరోజు ప్రవేశపెట్టిన LG Gram 2-in-1 ను రెండు సైజుల్లో ప్రవేశపెట్టింది. వాటిలో, ఒకటి 14 అంగుళాల సైజులో మరియు మరొకటి 16 అంగుళాల సైజులో తీసుకొచ్చింది. ఈ LG Gram 2-in-1 యొక్క రెండు వేరియంట్స్ కూడా Xe గ్రాఫిక్స్ కలిగిన Intel యొక్క 11 వ తరం ప్రొసెసర్ల శక్తితో పనిచేస్తాయి. 14 అంగుళాల LG Gram 2-in-1 1250 గ్రాముల బరువు ఉండగా, 16అంగుళాల మోడల్ 1480 గ్రాములతో ఉంటుంది. పోల్చిచూస్తే, LG Gram వేరియంట్స్ కంటే ఈ LG Gram 2-in-1 వేరియంట్స్ కొంచెం బరువుగా ఉంటాయి.
ఈ రెండు ల్యాప్ టాప్స్ కూడా 16:10 ఫామ్ ఫ్యాక్టర్ తో వస్తాయి. కానీ, 14 అంగుళాల వేరియంట్ FHD + రిజల్యూషన్ తో వస్తుండగా, 16 అంగుళాల వేరియంట్ మాత్రం QHD + డిస్ప్లేతో వస్తుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ LG Gram 2-in-1 డిస్ప్లేలు Gorilla Glass 6 యొక్కరక్షణతో వస్తాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile