Jio Cloud Laptop: కొత్త కంప్యూటింగ్ విధానంతో చవక ధరలో ల్యాప్ టాప్స్ తెచ్చే పనిలో పడింది జియో. ఇప్పటికే ఈ ల్యాప్ టాప్స్ కోసం HP వంటి మరిన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సంవత్సరం మధ్యలో JioBook (2023) ల్యాప్ టాప్ ను విడుదల చేసిన జియో, ఇప్పుడు మరింతగా ఈ ల్యాప్ టాప్ పరిధిని పెంచే ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఇదే దారిలో స్మార్ట్ టీవీ లను కూడా ల్యాప్ టాప్ ల మాదిరిగా వాడుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి 40 నుండి 50 వేల రూపాయల వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. అయితే, జియో కొత్త సమర్ధవంతమైన ల్యాప్ టాప్ లను చవక ధరలో తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తునల్టు నమ్మకంగా తెలిసినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇందుకోసం ముందుగా HP ChromeBook పైన ట్రయల్స్ రన్ చేయనున్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి, నవంబర్ 18 వ తేదీ ఎకనామిక్ టైమ్స్ అందించిన కొత్త రిపోర్ట్ తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం, కొత్త మరియు సమర్ధవంతమైన ల్యాప్ టాప్ లను చవక ధరలో అందించడానికి HP, Acer మరియు Lenovo వంటి పెద్ద కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెబుతోంది. ఈ విషయాన్ని జియో ఆఫీసర్ ఒకరు తెలిపినట్లు కూడా ఈ నివేదిక తెలిపింది.
Also Read : boAt Katana Blade: కొత్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!
అయితే, ఈ ల్యాప్ టాప్ నడవటానికి క్లౌడ్ బేస్ సపోర్ట్ అవసరం అవుతుంది. దీనికి తగిన నెలవారీ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందించడానికి కూడా జియో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతోంది. అంటే, Google One క్లౌడ్ మదిరాగా ఇది ఉంటుంది మరియు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
మరింత వివరాల్లోకి వెళితే, ఈ ల్యాప్ టాప్స్ మెమొరీ, ప్రోసెసర్ మరియు చిప్ సెట్ ను బట్టి వాటి రేటు ఉండవచ్చని కూడా తెలుస్తోంది. ఎంత ఎక్కువ వివరాలను కోరుకుంటే అంత ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉండవచ్చు. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ లను అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే రిలయన్స్ జియో మరింత పవర్ ఫుల్ క్లౌడ్ ల్యాప్ టాప్ లను చవక ధరకే అందుబాటులోకి తీసుకు రావచ్చని అనిపిస్తోంది. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.