సరికొత్తగా జియో విడుదల చేసిన బడ్జెట్ ల్యాప్ టాప్ JioBook ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తోంది. కస్టమర్ల కోసం జియో తన సొంత స్టోర్స్ అయిన రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ నుండి నేరుగా ఈ జియో ల్యాప్ టాప్ ను అఫర్ చేస్తోంది. జియో ల్యాప్ ఇంత తక్కువ ధరకే లభిస్తోందా, అని అనుకునేలా ప్రస్తుతం JioBook కేవలం రూ.15,799 రూపాయల అఫర్ ధరకే అందుబాటులో వుంది. మరి జియోబుక్ పైన అందించిన ఆఫర్లు, ధర, డిస్కౌంట్ ఆఫర్లు మరియు మరిన్ని వివరాలు క్రింద చూడవచ్చు.
JioBook ను ముందుగా రూ.19,500 ధరతో ఇది ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) లో లిస్టింగ్ చేసింది. అయితే, ఇప్పుడు జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.15,799 రూపాయల ధరతో సేల్ చేస్తోంది. జియోబుక్ ను Reliance digital Store నుండి అందరికి అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్/డెబిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే,15 వేల కంటే తక్కువ ధరకే జియో ల్యాప్ టాప్ సేల్ ను మీరు పొందవచ్చు.
ముందుగా, జియోబుక్ యొక్క డిస్ప్లేతో ప్రారంభిద్దాం. జియోబుక్ 11.6 ఇంచ్ డిస్ప్లేతో వుంది మరియు ఇది HD (1366×768) రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది LED బ్యాక్‌లైటింగ్‌తో కూడిన TN ప్యానెల్ మరియు యాంటీ-గ్లేర్ ఫీచర్ లను కలిగి ఉంది. జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు Adreno 610 GPU తో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 2GB LPDDR4x RAM మరియు 32GB eMMC స్టోరేజ్ తో వస్తుంది. మీరు కోరుకుంటే SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవచ్చు.
జియోబుక్ లేటెస్ట్ JioOS పైన నడుస్తుందని జియో తెలిపింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేక ఉండదా అనే విషయం పైన ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ యాడ్ బ్రౌజర్ వంటి కొన్ని ముందే ఇన్‌స్టాల్ చెయ్యబడిన యాప్‌లను మీరు ఈ ల్యాప్ టాప్ తో పొందుతారు మరియు జియో క్లౌడ్ PC కి కూడా సపోర్ట్ ఉంది.
ఇక ఇతర ఫీచర్లు మరియు కనెక్టివిటీ విషయానికి వస్తే, JioBook లో 4G సపోర్ట్, USB-A 2.0 పోర్ట్, USB-A 3.0 పోర్ట్, HDMI పోర్ట్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లు ఉన్నాయి. ఇక జాబితా చేయబడిన బ్యాటరీ పరిమాణం 55.1 నుండి 60 AH వరకు వుంటుంది మరియు ఇది 8 గంటల వరకుబ్యాకప్ ఇస్తుందని చెబుతోంది. ఈ జియో ల్యాప్ టాప్ లో మీరు డ్యూయల్ స్పీకర్ సెటప్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మైక్ సెటప్ మరియు స్టాండర్డ్ నో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా పొందుతారు.