Infinix INBook X1 Series: స్ట్రాంగ్ బాడీ మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ కానుంది
Infinix INBook X1 Series ల్యాప్ టాప్ యూనిక్ ఫీచర్లతో ఉంటుంది
మెటల్ బాడీ, తేలికైన మరియు స్లీక్ డిజైన్
55Wh హై కెపాసిటీ బ్యాటరీ
షియోమి రియల్ మి మాదిరిగానే Infinix కూడా టీవీలు మరియు ల్యాప్ టాప్స్ ను కూడా అందిస్తోంది. బడ్జెట్ వినియోగదారులను ఆకర్శించే విధంగా కేవలం బడ్జెట్ దరలోనే ఆకట్టుకునే ఫీచర్లతో మొబైల్స్ మరియు టీవీలను ప్రవేశపెట్టిన ఇన్ఫినిక్స్ ఇప్పుడు అదేదారిలో Infinix INBook X1 Series ల్యాప్ టాప్ ను కూడా యూనిక్ ఫీచర్లతో ఆవిష్కరించనున్నట్లు చెబుతోంది. ఈ ల్యాప్ టాప్ మెటల్ బాడీ, తేలికైన మరియు స్లీక్ డిజైన్ తో వంటి ఫీచర్లతో పాటుగా మరిన్ని ఫీచర్లను కలిగివున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. ఈ ల్యాప్ టాప్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.
Infinix INBook X1 Series: టీజింగ్ స్పెక్స్
Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ టీజింగ్ నుండి చాలా కీలకమైన ఫీచర్లను వెల్లడించింది. ఈ ల్యాప్ టాప్ ను సాధారణ ప్లాస్టిక్ తో కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫినిష్ మెటల్ బాడీతో లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ కలిగిన మొదటి ల్యాప్ టాప్ కూడా ఇదే అవుతుంది. ఇది కేవలం 16.3mm మందంతో చాలా సన్నగా మరియు 1.48kg బరువుతో చాలా తేలికగా ఉంటుంది.
ఇది బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఈ సెగ్మెంట్ లో బెస్ట్ అవుతుందని కూడా ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఎందుకంటే, ఇందులో 55Wh హై కెపాసిటీ బ్యాటరీని అందించింది. ఈ బ్యాటరీ 13 గంటలు నిరంతర వీడియో ప్లే బ్యాక్ టైం అందిస్తుందని కూడా టీజింగ్ మొదలుపెట్టింది. దీనికి తగ్గట్లు PD3.0 టైప్-C 65W ఫాస్ట్ ఛార్జర్ కూడా జతచేసింది. ఈ ఛార్జర్ తో కేవలం 55 నిముషాల్లోనే 70% ఈ ల్యాప్ టాప్ ఛార్జ్ అవుతుంది.
ఈ ల్యాప్ టాప్ లాంచ్ డేట్ లేదా మరింకేదైనా వివరాలను మాత్రం ఇంకా అందించలేదు. అయితే 'Coming Soon' ట్యాగ్ లైన్ తో ఈ అప్ కమింగ్ ల్యాప్ టాప్ టీజింగ్ మొదలుపెట్టింది ఇన్ఫినిక్స్.