ఇన్ఫినిక్స్ గత సంవత్సరం భారీ ఫీచర్లతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన Infinix INBook X1 యొక్క తరువాతి తరం ల్యాప్ టాప్ గా Infinix INBook X2 ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇన్ఫినిక్స్ ఈ ల్యాప్ టాప్ ని Core i9 కాన్ఫిగరేషన్ వరకూ వెళ్లగలిగిన 11th జెన్ ఇంటెల్ CPU తో ప్యాక్ చేసింది. SSD స్టోరేజ్, WiFi-6 మరియు ఎక్కువ సమయం బ్యాకప్ అందించగల పవర్ ఫుల్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరి ఈ లేటెస్ట్ బడ్జెట్ ల్యాప్ టాప్ ఎలాంటి ఫీచర్లతో వచ్చిందో తెలుసుకుందామా.
ఈ ల్యాప్ టాప్ 300 Nits బ్రైట్నెస్ అందించగల 15.6 ఇంచ్ FHD డిస్ప్లే ని కలిగివుంది. స్క్రీన్ కి పైన FHD వెబ్ క్యామ్ ను కూడా ఈ ల్యాప్ టాప్ అందించింది. ఇక ఈ ల్యాప్ టాప్ ఇన్ సైడ్ లోకి వెళితే, ఇది i3 నుండి i7 మోడల్ వరకూ కాన్ఫిగర్ చేయగల 11th gen ఇంటెల్ ప్రాసెసర్ ఉంది. ఇది గరిష్టంగా 16GB RAM మరియు 512GB PCIe 3.0 SSD స్టోరేజ్ తో జతచేయబడింది. i5 మరియు i7 వేరియంట్స్ Intel Iris Xe గ్రాఫిక్ తో వస్తాయి.
ఇందులో 55Whr హై కెపాసిటీ బ్యాటరీని 65W USB-C ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ల్యాప్ టాప్, Windows 11 సాఫ్ట్‌వేర్, DTS ఆడియో, డ్యూయల్-మోడ్ WiFi 6, 2 USB-C, 2 USB- 3.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 1 HDMI 1.4 మరియు 1 SD కార్డ్ స్లాట్ వాటి ఫీచర్లను కలిగివుంది.
ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్ 2 ల్యాప్ టాప్ రూ.32,990 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది మరియు ఇది 8GB ర్యామ్ మరియు 256GB మెమరీ కలిగిన i3 వేరియంట్ కోసం నిర్ణయించ బడింది. అలాగే, 8GB ర్యామ్ మరియు 512GB మెమరీ కలిగిన i3 వేరియంట్ ధర రూ.35,990 కాగా, 8GB ర్యామ్ మరియు 512GB మెమరీ కలిగిన i5 వేరియంట్ ధర రూ.42,990. ఇక చివరిగా 8GB ర్యామ్ మరియు 512GB మెమరీ కలిగిన i7 వేరియంట్ ధర రూ.52,990 గా వెల్లడించింది.
ఈ ల్యాప్ టాప్ అక్టోబర్ 18 నుండి Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.