20,490 రూ లకు 1TB హార్డ్ డిస్క్ తో లెనోవో ideapad 110 లాప్ టాప్ లాంచ్

Updated on 22-Jul-2016

ఇండియా లో లెనోవో  కొత్తగా బడ్జెట్ లో ideapad 110 లాప్ టాప్ ను లాంచ్ చేసింది. విండోస్ 10 పై నడిచే ఈ మోడల్ స్టార్టింగ్ ప్రెస్ 20,490 రూ నుండి 24,990 రూ వరకూ ఉన్నాయి.

స్టార్టింగ్ ప్రెస్ ఏంటి అని అనుకునే వారికి… లాప్ టాప్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ లానే ఒకే పేరుతో ర్యామ్ మరియు ఇతర స్పెక్స్ ను మారుస్తూ రెండు మూడు వేరియంట్స్ లో రిలీజ్ అవుతాయి.

అయితే స్టార్టింగ్ ప్రెస్ తో వస్తున్న మోడల్ లో ఇంటెల్ celeron డ్యూయల్ కోర్ ప్రొసెసర్ ఉంది. ఇతర మోడల్స్ లో ఇంటెల్ పెంటియం క్వాడ్ కోర్ ప్రోసెసర్స్ ఉన్నాయి.

ideapad 110 స్పెసిఫికేషన్స్ – 15.6 in HD 1366x 768 పిక్సెల్స్ డిస్ప్లే, 4GB రామ్ (upgradable 8gb రామ్), 1TB హార్డ్ డిస్క్ SSD, 3సెల్ 24WHr బ్యాటరీ, DVD డ్రైవ్.

USB 3.0, bluetooth 4.1, 4 hours continous వీడియో ప్లే బ్యాక్ తో లాప్ టాప్ బరువు 2.2KG ఉంటుంది. కేవలం Ebony బ్లాక్ కలర్ లోనే బయట రిటేల్ స్టోర్స్ లో అందుబాటులోకి వస్తుంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :