12,999 రూ లకు 360 డిగ్రీ రొటేటింగ్ టచ్ స్క్రీన్ లాప్ టాప్ లాంచ్
By
Team Digit |
Updated on 27-Dec-2016
ఇండియాలో 12,999 రూ లకు iBall బ్రాండ్ నుండి CompBook i360 అనే మోడల్ రిలీజ్ అయ్యింది. దీని హైలైట్ – 360 డిగ్రీ కోణంలో తిరుగుతుంది స్క్రీన్.
స్పెక్స్ – 11.6 in ఫుల్ HD టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంటెల్ atom X5-Z8300 1.44GHz ప్రొసెసర్, 2GB రామ్, ఇంటెల్ HD గ్రాఫిక్స్ 5300, విండోస్ 10 OS.
32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్, రెండు విధాలుగా స్టోరేజ్ సపోర్ట్ తక్కువే, అయితే external హార్డ్ డిస్క్ లు మాత్రం వాడుకోగలరు.
డ్యూయల్ స్పీకర్స్, ఆడియో జాక్, బ్లూ టూత్ 4.0, 10,000 mah బ్యాటరీ ఉంది ఇది 8.5 గంటలు బ్యాక్ అప్ వస్తుంది అని తెలిపింది కంపెని. గోల్డెన్ కలర్ లోనే ఉంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile