8GB ram, 1TB హార్డ్ డిస్క్ తో బెస్ట్ ప్రైస్ లో లాప్ టాప్ డీల్ [OCT 13]

8GB ram, 1TB హార్డ్ డిస్క్ తో బెస్ట్ ప్రైస్ లో లాప్ టాప్ డీల్ [OCT 13]

లాప్ టాప్ కొనే ఉద్దేశంలో ఉన్నారా? అయితే ప్రస్తుతం ఒక మంచి డీల్ ఉంది స్నాప్ డీల్ లో. highlights – 8GB రామ్ మరియు 1TB ఇంబిల్ట్ హార్డ్ డిస్క్ – ప్రైస్ 22,999 రూ. SBI డెబిట్ కార్డ్ తో purchase చేస్తే అదనంగా 2000 రూ తగ్గుతాయి.

కంపెని Fujitsu. లాప్ టాప్ పేరు Fujitsu Lifebook A555 Notebook. ఇంటెల్ 5 th gen i3 base 2GHz ప్రొసెసర్ etc ఉన్నాయి. ప్రైస్ కు తగ్గా స్పెక్స్ కావు ఇవి. చాలా ఎక్కువే అని చెప్పాలి.

ఈ లింక్ లో కంప్లీట్ స్పెక్స్ అండ్ బయింగ్ డిటేల్స్ చూడగలరు. మీరు ఇది చదవుతున్న time కు పైన చెప్పిన ప్రైస్ ఉండకపోవచ్చు. 

ఇప్పుడు లాప్ టాప్ లోని మైనస్ పాయింట్స్ :

  • ఆపరేటింగ్ సిస్టం తో రావటం లేదు. అంటే లాప్ టాప్ కొని ఓపెన్ చేసిన తరువాత అందులో ఆల్రెడీ విండోస్ లేదా ఇతర OS ఏదీ ఇంస్టాల్ అయ్యి ఉండదు. మీరే OS ఇంస్టాల్ చేసుకోవాలి. సుమారు 500 రూ ఇచ్చి బయట షాప్స్ లోకి లేదా అవగాహన ఉన్న ఫ్రెండ్స్ వద్దకు వెళ్లి OS installing చేసుకోగలరు. అయితే ఇవి ఒరిజినల్ జెన్యూన్ OS లు కాకపోవటానికి chances ఎక్కువ ఉంటాయి. 8GB రామ్, 1TB హార్డ్ డిస్క్ పై మీకు ఎక్కువ మక్కువ ఉంటే కనుక తీసుకోవచ్చు.(నేనైతే తీసుకుంటాను).
  • నేను వాడే లాప్ టాప్స్ లో ఒకటి Fujitsu Lifebook AH552 మోడల్. పర్సనల్ గా specifications బాగుంటే చాలు, బ్రాండ్ ఏదైనా మినిమమ్ స్టాండర్డ్స్ ఉంటే రిస్క్(జనరల్ POV లో) చేసి తీసుకునే user type.(మీరూ అటువంటి వారైతే ఈజీ గా తీసుకోవచ్చు అనే చెబుతున్నాను) సో ఇక్కడ ఈ బ్రాండ్ ద్వారా నా అనుభవాలను మీకు తెలియజేస్తాను.
  • ప్లస్ పాయింట్స్ – స్ట్రాంగ్ బిల్డ్, reliable, mouse gestures కు సెల్ఫ్ సాఫ్ట్ వేర్, spill resistant కీ బోర్డ్ ఉన్నాయి.
  • మైనస్ పాయింట్స్ – mouse ట్రాక్ పాడ్… DEll, సోనీ వంటి బ్రాండ్స్ లో ఉన్నంత క్వాలిటీ గా ఉండదు. ట్రాక్ పాడ్ టచ్ పాయింట్స్ బాగుంటాయి కాని మరోవైపు అంత క్వాలిటీ గా లేనట్లు కూడా తెలుస్తూ ఉంటుంది. రైట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్ బటన్స్ అయితే ప్రెస్ చేస్తున్నప్పుడు శబ్దాన్ని ఇస్తాయి. ఇది మీకు సైలెంట్ వాతారణాల్లో ఉన్నప్పుడు నచ్చకపోవచ్చు.
  • స్పీకర్ సౌండ్ లౌడ్ గా లేదు.
  • డిస్ప్లే కలర్ ఫుల్ గా రిచ్ గా ఉండదు, అలాగని బాలేదు అని చెప్పలేము. బాగుంటుంది. మూవీస్ వాచింగ్ అదీ ఈజీ గా సంతృప్తి చెందుతారు.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo