16GB రామ్ తో ఇండియాలో ఆసుస్ రెండు లాప్ టాప్స్ లాంచ్

Updated on 18-Aug-2016

జెన్ ఫోన్ 3 సిరిస్ లో ఆసుస్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి అని మీకు తెలుసు. వీటితో పాటు కంపెని జెన్ బుక్ 3 మరియు Transformer 3 pro పేర్లతో రెండు లాప్ టాప్స్ కూడా లాంచ్ చేసింది ఇండియాలో.

Transformer 3 pro 2-in-1 లాప్ టాప్. అంటే టాబ్లెట్ మరియు లాప్ టాప్ గా కూడా వాడుకోగలరు. ఇవి విండోస్ 10 OS పై నడుస్తున్నాయి.

ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా సేల్స్ స్టార్ట్ అవుతాయి అక్టోబర్ నుండి. జెన్ బుక్ 3 ప్రైస్ 1,47,990 rs అండ్ Transformer 3 ప్రో 1,44,990 rs.

ZenBook 3 (UX390UA) స్పెక్స్ – 12.5 in FHD డిస్ప్లే, ఇంటెల్ కోర్ i7-7500U ప్రొసెసర్, 16GB LPDDR3 రామ్, 512 GB SSD హార్డ్ డిస్క్, ఇంటెల్ HD గ్రాఫిక్స్, 6 సెల్ 40WHr బ్యాటరీ, Harmon Kardon స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Transformer 3 pro (T303UA) స్పెక్స్ – 12.6 in డిస్ప్లే, ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16GB రామ్, 512GB SSD హార్డ్ డిస్క్, 13MP రేర్ కెమెరా, 2MP IR కెమెరా, HDMI అండ్ USB 3.0 పోర్ట్స్ తో వస్తుంది.

Transformer 3 pro మైక్రో సాఫ్ట్ రీసెంట్ గా రిలీజ్ చేసిన surface pro 4 కన్నా సన్నని బాడీ (8.35mm) బాడీ తో, నాలుగు రెట్లు దాని కన్నా అధిక సౌండ్ తో మరియు డిటాచ్ చేయగలిగే కీ బోర్డ్ అండ్ stylus పెన్ తో వస్తుంది.

4GB ram తో వచ్చే సర్ ఫేస్ ప్రో 4 వేరియంట్ ప్రైస్ 70 వేలకు పైనే ఉంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :