Acer Chromebook Plus పై జబర్దస్త్ ఆఫర్: 17 వేలకే Intel Core i3 ల్యాప్ టాప్ అందుకోండి.!

Acer Chromebook Plus పై జబర్దస్త్ ఆఫర్: 17 వేలకే Intel Core i3 ల్యాప్ టాప్ అందుకోండి.!
HIGHLIGHTS

Acer Chromebook Plus పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి

Google AI తో పని చేసే ఈ పవర్ ఫుల్ క్రోమ్ బుక్ ఈరోజు చాలా చవక ధరకే లభిస్తుంది

ఈ సూపర్ డీల్ ను మీరు Flipkart నుంచి అందుకోవచ్చు

Acer Chromebook Plus ల్యాప్ టాప్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. Intel Core i3 N305 మరియు Google AI తో పని చేసే ఈ పవర్ ఫుల్ క్రోమ్ బుక్ ఈరోజు చాలా చవక ధరకే లభిస్తుంది. ఈ సూపర్ డీల్ ను మీరు Flipkart నుంచి అందుకోవచ్చు. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ల్యాప్ డీల్ పై ఒక లుక్కేయండి.

Acer Chromebook Plus : ఆఫర్

ఏసర్ యొక్క ఈ క్రోమ్ బుక్ ను ఇండియాలో రూ. 35,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ల్యాప్ టాప్ ఈరోజు రూ. 16,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.

ఈ ల్యాప్ టాప్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ పవర్ ఫుల్ క్రోమ్ బుక్ ను కేవలం రూ. 17,990 రూపాయల అతి భారీ డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. Check Offer Here

Acer Chromebook Plus : ఫీచర్స్

ఈ ఏసర్ క్రోమ్ బుక్ ప్లస్ ల్యాప్ టాప్ Intel Core i3 N305 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ క్రోమ్ బుక్ ప్రోసెసింగ్ మరియు మల్టీ టాస్క్ కి అనువైనది. ఇది 8GB LPDDR5 ర్యామ్ మరియు 256 GB SSD స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది 3.8 GHz వరకు స్పీడ్ ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Intel Integrated UHD గ్రాఫిక్ ప్రోసెసర్ ను కూడా కలిగి ఉంటుంది.

Acer Chromebook Plus

ఈ క్రోమ్ బుక్ 14 ఇంచ్ Full HD IPS LED- బ్యాక్ లిట్ LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది మరియు HDR సపోర్ట్ తో వస్తుంది. ఈ క్రోమ్ బుక్ ప్లస్ 45 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 3 సెల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది కేవలం 1.43 Kg బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ లో DTS సపోర్ట్ కలిగిన 2 బిల్ట్ ఇన్ స్పీకర్లు కూడా ఉంటాయి.

Also Read: Free Laptop Scam పేరుతో స్టూడెంట్స్ కి వల వేస్తున్న స్కామర్లు.. జర భద్రం.!

ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ క్రోమ్ బుక్ విడుదలైన తర్వాత ఇంత చవక ధరకు లభించడం ఇదే మొదటి సారి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo