గత రెండు వారాల నుండి జియో చవక ధరకే ల్యాప్ టాప్స్ గురించే ఎక్కువగా ఆన్లైన్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు కొత్తగా ఎకనామిక్ టైమ్స్ అందించిన రిపోర్టు ద్వారా జియో యొక్క AGM 2021 నుండి చవక ధరకే ల్యాప్ టాప్స్ అనౌన్స్ మెంట్ చెయ్యవచ్చు అని అనిపిస్తోంది. ఇక గతంలో వచ్చిన కొన్ని అంచనా రిపోర్ట్స్ ద్వారా ఈ చవక ల్యాప్ టాప్స్ ఎటువంటి ఫీచర్లతో రావచ్చనే విషయం కూడా తెలియవచ్చింది.
చాలా తక్కువ ధరకే అందరికి అందుబాటులో ఉండేలా 'జియో బుక్' పేరుతో జియో ల్యాప్ టాప్స్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు గతంలో వచ్చిన రిపోర్ట్స్ సూచించాయి. వీటి ధరను దృష్టిలో పెట్టుకొని, విండోస్ OS తో కాకుండా గూగుల్ OS తో పనిచేసే విధంగా వీటిని తయారు చెయ్యవచ్చని చెబుతోంది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్స్ ఆండ్రాయిడ్ యొక్క కస్టమ్ వెర్షన్ తో పనిచేస్తాయని, దీని JioOS గా పరిచయం చేస్తుంది.
ముఖ్యంగా, జియో ఇప్పటికే ఈ ల్యాప్ టాప్స్ తయారు చేసే పనిలో పడినట్లు ఒక నమూనా ల్యాప్ టాప్ కూడా తయారు చేసినట్లు గత నివేదికలు తెలిపాయి. ఈ ప్రోటోటైప్ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ 665 ప్రాసెసర్ తో ఉన్నట్లు సూచింది. ఈ చిప్ సెట్ ఇన్ బిల్ట్ 4G మోడెమ్ తో వస్తుంది కాబట్టి ఈ జియో బుక్ ల్యాప్ టాప్ నేరుగా జియో 4G నెట్వర్క్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే గనుక నిజమైతే, ఈ జియో ల్యాప్ టాప్స్ మార్కెట్లో ఒక కొత్త వరవడని తీసుకువస్తాయి.