Youtube యూజర్లకు ఒక చేదు వార్త.. ఇక ఆ అవకాశం ఉండదట.!

Youtube యూజర్లకు ఒక చేదు వార్త.. ఇక ఆ అవకాశం ఉండదట.!
HIGHLIGHTS

యూట్యూబ్ కొత్త ఫీచర్

రెవిన్యూ పెంచేందుకు కొత్త నిర్ణయం

ఇక నుండి యాడ్స్ పూర్తిగా చూడాల్సిందే

గూగుల్ యాజమాన్య వీడియో ప్లాట్ ఫామ్ Youtue లో వీడియోలను ఎంజాయ్ చేస్తున్నారా? అయితే, మీకోసమే ఈ చేదు వార్త. యూట్యూబ్ వీడియోలను చూసేప్పుడు వచ్చే యాడ్స్ ను ఆదుకోవడానికి యాడ్ బ్లాకర్స్ ను ఉపయోగించే వారి కోసమే ఈ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే, యాడ్స్ ను బ్లాక్ చెయ్యకుండా నిరోధించేందుకు యూట్యూబ్ లో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్ కనుక సఫలం అయితే, యూట్యూబ్ లో యాడ్స్ ను స్కిప్ లేదా ఆడ్డుకునే వీలుండదు. అంటే, యూట్యూబ్ వీడియోలో వచ్చే యాడ్స్ ను పూర్తిగా చూడవలసి ఉంటుంది. ఈ కొత్త అప్డేట్ వివరాలు ఏమిటో తెలుసుకోండి. 

యూట్యూబ్ ఇటువంటు నిర్ణయం  తీసుకుంది? అని మీకు డౌట్ రావచ్చు. దీనికి తగైన కారణాలు ఉన్నాయి. యూట్యూబ్ లో మీరు కంటెంట్ పైన వచ్చే యాడ్స్ ద్వారా మాత్రమే ఆ వీడియో క్రియేటర్లు ఆదాయాన్ని పొందుతారు. యూజర్లు వీడియోల పైన వచ్చే యాడ్స్ ని కనుక చూడకపోతే వారికీ ఎటువాంటి ఆదాయం ఉండదు. గత సంవత్సరం నుండి యూట్యూబ్ పైన క్రియేటర్స్ కి వచ్చే ఆదాయం ఈ యాడ్ బ్లాకింగ్ ద్వారా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే, ఎటువంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్ వీడియోలను చూసే అవకాశం కూడా వుంది. ఇదేదో తర్డ్ పార్టీ యాప్ తో సాధ్యం అవుతుందని మాత్రం అనుకోకండి. దీనికోసం మీరు Youtube Premium సబ్ స్క్రిప్షన్ ని మీరు తీసుకోవలసి ఉంటుంది. 

వాస్తవానికి, గత సంవత్సరం పడిపోయిన రెవిన్యూ ఈ సంవత్సరం మొదటి క్వార్ట్రర్ లో కూడా మరింత దిగజారిన కారణంగా, యూట్యూబ్ ఈ గ్యాప్ ని ఫిక్స్ చేసి కంటెంట్ క్రియేటర్స్ ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. 

అయితే, ఈ కొత్త పరిణామం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇదే కనుక జరిగితే యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్స్ కి ఆదాయం పెరిగే అవకాశం మరింత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo