Youtube Update: టీవీ వంటి అనుభూతి కోసం కొత్త ఫీచర్లు జత చేసిన యూట్యూబ్.!

Youtube Update: టీవీ వంటి అనుభూతి కోసం కొత్త ఫీచర్లు జత చేసిన యూట్యూబ్.!
HIGHLIGHTS

యూట్యూబ్ యాప్ లో కొత్త ఫీచర్లను జత చేసింది

వినియోగదారులకు టీవీ వంటి అనుభూతి

వీక్షణా దృష్టిని మరింత పెంచడానికి దీన్ని రీడిజైన్ చేసింది

Youtube Update: వినియోగదారులకు టీవీ వంటి అనుభూతి కోసం యూట్యూబ్ యాప్ లో కొత్త ఫీచర్లను జత చేసింది. ఈ ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ యాప్ కు ఈ కొత్త అప్డేట్ మరింత సౌకర్యవంతంగా మరియు వ్యూహాత్మకంగా మార్చింది. ముందుగా ఉన్న 100కాన్సెప్ట్ లను డజనుకు కుదించింది మరియు దాన్ని ఆ పైన ఒక్కతాటి పైకి యుట్యూబ్ టీమ్ తీసుకొచ్చింది. ఆ తరువాత, 30 వేర్వేరు యూజర్ల ద్వారా చేసిన అనేక డిజైన్ మార్పులు మరియు నిర్వచించిన చాలా చర్చల తరువాత ఎట్టకేలకు వారు త్వరలో యూట్యూబ్ విడుదల చేయ్యనున్న అంశాలను ఎంచుకోవడం జరిగింది.

అంటే, యూట్యూబ్  యూజర్లకు గొప్ప అనుభవాన్ని అందించడానికి ఈ కొత్త విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. యూజర్ల వీడియో వీక్షణా దృష్టిని మరింత పెంచడానికి దీన్ని రీడిజైన్ చేసింది. ఇది కాకుండా, స్క్రీన్ పైన కనిపించే ఇన్ఫర్మేషన్ హ్యాచరీ ను కూడా యూట్యూబ్ డిజైనర్స్ పునర్నిర్మించారు. ఇప్పుడు స్క్రీన్ పైన క్రియేటర్ పైకి తరలించబడింది మరియు ఇప్పుడు వీడియో క్రింద ఉన్న పేజీలో కనిపిస్తుంది. అయితే, సబ్‌స్క్రైబ్ బటన్ మాత్రం యదాస్థానంలో అలాగే ఉంటుంది. థంబ్స్-అప్ మరియు డౌన్ బటన్‌లు వరుసగా క్రిందికి మార్చబడ్డాయి. యాప్‌లో దీర్ఘచతురస్రాకార ఉండే బటన్స్ మరియు థంబ్‌ నెయిల్స్ ఇప్పుడు గుండ్రంగా రూపాంతరం చెందాయి.

ముఖ్యంగా, గతంలో ముదురు బూడిద రంగులో ఉన్న YouTube డార్క్ మోడ్ ఇప్పుడు డార్క్ బ్లాక్ రంగులో ఉంది. కంటెంట్ ను టీవిలో చూసే విధంగా మార్చడానికే ఈ చర్య తీసుకుంది. వాస్తవానికి, ఈ అప్షన్ వ్యూహాత్మకమైనది మాత్రమే కాదు బార్టిల్‌సన్-బ్రెనెమాన్ ఎఫెక్ట్‌ను ఉపయోగించడానికి ఇది దరి తీస్తుంది. దీని అర్ధం ఏమిటంటే, డార్క్ బ్లాక్ లో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పడు స్క్రీన్ పైన ఇమేజ్ మరింత బ్రెట్ గా కనిపిస్తుంది. అందుకే, యూట్యూబ్ ఈ చర్యని తీసుకున్నట్లు చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo