Youtube లో వీడియోలు చూడాలంటే ఇక ఇది తప్పని సరి.!

Youtube లో వీడియోలు చూడాలంటే ఇక ఇది తప్పని సరి.!
HIGHLIGHTS

యూట్యూబ్ కొత్త నిర్ణయం

ఇక యాడ్స్ చూడటం తప్పని సరి

యాడ్స్ ని బ్లాక్ చేసే అవకాశం ఉండదు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వీడియో ప్లాట్ ఫామ్ గా ఎదిగిన Youtube గురించి తెలియని వారుండరు. ప్రతిరోజూ Youtube కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుందంటే అతిశయోక్తి కాదు. అన్ని వీడియోలను ఉచితంగా చూసే వీలుండం కూడా ప్రజలకు ఎక్కువగా చేరువయ్యింది. అంతేకాదు, ఎవరికి నచ్చిన వీడియో లను వారి చానల్ ద్వారా అప్లోడ్ చేయడం దాని ద్వారా ఆదాయం సంపాదించడం వంటి చాలా అవకాశాలు అందించిన యూట్యూబ్ ఇప్పడు కొత్త నిర్ణయం తీసుకుంది. 

గత కొంత కాలంగా యూట్యూబ్ ఆదాయం పడిపోవడంతో యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను పెంచడం లేదా యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచే పనిలో పడింది. వాస్తవానికి, యూట్యూబ్ వీడియో లలో యాడ్స్ సహజం గానే వస్తుంటాయి. అయితే, ఈ యాడ్స్ చూడ్డానికి ఇష్టపడని వారు తర్డ్ పార్టీ యాప్స్ లేదా ఇతర మార్గాల ద్వారా ఆ యాడ్స్ ని బ్లాక్ చేస్తుంటారు. దీని ద్వారా యూట్యూబ్ కే కాకుండా వారు చూసే వీడియోలను క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్స్ కు కూడా ఆదాయం పడిపోతుంది. 

అందుకే, కంటెంట్ క్రియేటర్స్ కు కూడా ఆదాయ మార్గాలను సుగమం చెయ్యడానికి మరియు కొత్త క్రియేటర్స్ ను ప్రోత్సహించడానికి యూట్యూబ్ లో ఇక నుండి Add ను Block చేసే యాడ్ బ్లాకర్స్ ను నిర్వీర్యం చేసేల కొత్త ఫీచర్ జత చేస్తోంది. అంటే, ఇక నుండి యూట్యూబ్ లో వీడియోలలో వచ్చే యాడ్స్ ను బ్లాక్ చేయడం వీలుకాదు, అని అర్ధం చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, Youtube లో వీడియోలు చూడాలంటే యాడ్స్ చూడటం తప్పని సరిగా మారుతుంది.   

ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో లలో వచ్చే యాడ్స్ ను చూడాటానికి ఇష్టపడక పొతే, మీరు Youtube Premium కి మారవచ్చు. దీనికోసం మీరు ప్రీమియం సబ్ స్కిప్షన్ కోసం డబ్బు చెల్లించ వలసి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo