ప్రీమియం యూజర్ల కోసం AI Chatbot తెచ్చే పనిలో YouTube ఉన్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీమియం సబ్ స్క్రైబర్స్ ను సాధించిన యూట్యూబ్ ఇప్పుడు ప్రీమియం యూజర్స్ కోసం కొత్త తరం ఆలోచన చేస్తోంది. అన్నింటా మిన్నైనా టూల్ గా పేరొందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే, AI Chatbot ను ప్రీమియం యూజర్ల కోసం అందించాలని చూస్తోంది. దీనికోసం, ఆచరణ సాధ్యమైన పనులలో కూడా యూట్యూబ్ ఉన్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి.
గూగుల్ యాజమాన్యం లోని సొంత ప్లాట్ ఫామ్ ఇప్పటికే ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కోసం చాలా ఫీచర్స్ ను అంధుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు మరొక కొత్త ఉపయోగకరమైన ఎఐ చాట్ బాట్ ను కూడా అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ చాలా అనువైన మరియు అవసరమైన కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకునేలా మరింతగా రూపుదిద్దే ప్రయంత్నం చేస్తోంది.
Also Read : Redmi 12 Series: 100 రోజుల్లోనే 30 లక్షల యూనిట్స్ హుష్ పటాక్.!
యూట్యూబ్ లో కొత్తగా జత చేసిన ఈ ఎఐ చాట్ బాట్ ఫీచర్ లో ముఖ్యమైనది కన్వర్జేషన్ ఎఐ. ఇది యూజర్ల వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ ను మరింత ఉన్నతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కొత్తగా తీసుకు వచ్చిన యూట్యూబ్ ఎఐ ఫీచర్ ఎక్స్పరిమెంటల్ ఫీచర్స్. ఈ కొత్త ఎఐ ఎక్స్పరిమెంటల్ ఫీచర్ డిసెంబర్ 5 వరకూ అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ తెలిపింది. దీన్ని చెక్ చెయ్యడానికి youtube.com/new ను సందర్శించాలి.
ఆండ్రాయిడ్ మరియు iOS లోని యూట్యూబ్ యాప్ లో కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి టాపిక్ వారీగా షార్ట్ చేయండి. మూడు చుక్కల మెనూ ద్వారా ఈ ఫీడ్ బ్యాక్ ను షేర్ చేయండి. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ అన్ని వీడియోల కోసం అందుబాటులో లేదు. ఇది యూట్యూబ్ వీడియోలను మరింత మెరుగు దిద్దడానికి ఉపయోగ పడుతుంది.