Dream Screen: Youtube లో కొత్త AI ఫీచర్ లాంచ్..Shorts చూసే వారికి చేసే వారికీ పండగే.!

Updated on 23-Sep-2023
HIGHLIGHTS

Youtube లో కొత్త AI ఫీచర్ లాంచ్

Youtube Dream Screen ఫీచర్ ను తీసుకొచ్చింది

కొత్త Dream Screen ఫీచర్ అనేది AI-Enabled Tool

Dream Screen: Youtube లో కొత్త AI ఫీచర్ లాంచ్ చేయడమే కాకుండా Shorts చూసే వారికి చేసే వారికీ పండగే అని చెబుతోంది. Youtube నిర్వహించిన లేటెస్ట్ ఈవెంట్ నుండి Youtube Dream Screen ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త Dream Screen ఫీచర్ అనేది AI-Enabled Tool మరియు ఇది Short వీడియోలు మరియు బ్యాగ్రౌండ్ లను ప్రాంప్ట్ ను బేస్ చేసుకొని క్రియేట్ చేయడానికి shorts క్రియేటర్స్ ను అనుమతిస్తుంది.

What is a dream screen?

అసలు ఏమిటి Youtube తీసుకువచ్చిన ఈ Dream Screen అని మీకు అనుకుంటున్నారా? Dream Screen అనేది Shorts లో వీడియోలను క్రియేట్ చేసే వారు వారి వీడియోలకు అనుకూలమైన బ్యాగ్రౌండ్స్ ను ఆటొమ్యాటిగా అందిస్తుంది మరియు వాటిలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకునే వీలుంది. సింపుల్ గా చెప్పాలంటే, Shorts Creators కి ఈ ఫీచర్ గొప్ప వరం అని చెప్పొవచ్చు. ఎందుకంటే, క్రియేటర్స్ కి మరిన్ని సులభమైన అప్షన్ లను ఆటొమ్యాటిగ్గా అందిస్తుంది కాబట్టి వీడియో క్రియేట్ చేయడం చాలా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

యూట్యూబ్ సరికొత్తగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ తో పాటుగా Youtube కొత్త YouTube Create App ను కూడా లాంచ్ చేసింది. ఈ YouTube Create యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో వుంది మరియు Beta యూజర్లు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేసే అవకాశం అందించింది.

Also Read: Vivo T2 Pro 5G: 64MP OIS కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో చవక ధరలో లాంచ్.!

Is YouTube Studio an app?

అవును, YouTube Studio అనేది యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ కొత్తగా తీసుకువచ్చిన App మరియు ఇది టెస్టింగ్ కోసం బీటా యూజర్లకు అందుబాటులో వుంది.

what is the use of YouTube Studio?

YouTube Studio Features

యూట్యూబ్ కొత్త తీసుకు వచ్చిన ఈ YouTube Studio App మంచి ఎడిటింగ్ ఫీచర్స్ ను కలిగి వుంది. మీ ఫోటోలు మరియు వీడియోలను ఎడిట్ లేదా క్రియేట్ చెయ్యడానికి ఎటువంటి తర్డ్ పార్టీ App తో పని లేకుండా ఈ కొత్త Youtube యాప్ లోనే సింపుల్ గా చేసుకోవచ్చు.

Also Read: Gold Rate: నిన్న ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర..ఈరోజు ఎంతంటే.!

YouTube Studio Features

YouTube Studio Features

ఈ కొత్త APP లో టెక్స్ట్ ఎఫక్ట్స్, స్టిక్కర్స్, GIFs, Emojis, డీఫాల్ట్ సౌండ్స్ తో పాటుగా మీకు నచ్చిన ఆడియోలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే, మీ వీడియో ఎడిటింగ్ కోసం అవసరమైన వాయిస్ ఓవర్, ట్రిమ్మింగ్, క్యాప్షనింగ్ మరియు మరిన్ని ఉపయోగకరమైన వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ ఇందులో వున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :