Youtube Gaming: డైరెక్ట్ గేమింగ్ కోసం Playables ఫీచర్ తెచ్చిన యూట్యూబ్.!
యూట్యూబ్ కూడా కొత్త గేమింగ్ ఫీచర్ తీసుకు వచ్చింది
Youtube Gaming కోసం కొత్తగా Playables ఫీచర్ ను తీసుకు వచ్చింది
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు యూట్యూబ్ లో గేమింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు
ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కూడా కొత్త గేమింగ్ ఫీచర్ తీసుకు వచ్చింది. Youtube Gaming కోసం యూట్యూబ్ కొత్తగా Playables ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం ప్రీమియం యూజర్స్ కి మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ గేమింగ్ కోసం యూట్యూబ్ లో కొత్తగా తీసుకు వచ్చిన ఈ ప్లేయబుల్స్ ఫీచర్ పైన ఒక లుక్కేయండి.
Youtube Gaming Features Playables
యూట్యూబ్ లో గేమింగ్ కోసం ప్లేయబుల్స్ ఫీచర్ ను జత చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు యూట్యూబ్ లో గేమింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ అవకాశం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందించింది. ఈ ఫీచర్ తో ప్రస్తుతం 37 ఆన్లైన్ గేమ్ లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రీమియం యూజర్లు ఈ 37 ఆన్లైన్ గేమ్స్ ను యూట్యూబ్ లో ఆడుకోవచ్చు.
వాస్తవానికి, ప్రధాన OTT ప్లాట్ ఫామ్స్ ముందు నుండే గేమింగ్ ఆప్షన్ లను వాటి ప్లాట్ ఫామ్స్ పైన అందించాయి. అయితే, ఆ గేమ్స్ ఆడుకోవడానికి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. కానీ, యూట్యూబ్ గేమింగ్ కోసం ఎటువంటి అధనపు డౌన్ లోడ్స్ అవసరం ఉండదు.
Also Read : Fire-Boltt Lumos: అతి తక్కువ ధరలో స్టైన్ లెస్ స్టీల్ లగ్జరీ స్మార్ట్ వాచ్ వచ్చేసింది.!
యూట్యూబ్ లో ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుంది?
ఈ ఫీచర్ కోసం ముందుగా యూట్యూబ్ ఆప్ ఓపెన్ చెయ్యాలి. తరువాత హోమ్ పేజ్ ను స్క్రోల్ చేస్తే క్రింద కనిపించే పేయబుల్స్ షెల్ఫ్ పైన క్లిక్ చెయ్యాలి. అంతే, ఇక్కడ కనిపించే మీ ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేసి ప్రీమియం ప్రయోజనాలలోని పేయబుల్స్ లోని గేమ్స్ ను ఆడుకోవచ్చు. అయితే, మీరు ప్రీమియం సబ్ స్క్రైబర్ అయితేనే ఈ అవకాశం మేము లభిస్తుంది.
ఈ యూట్యూబ్ పేయబుల్స్ ఫీచర్ 28 మార్చి 2024 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ ప్లేయబుల్స్ లో యాంగ్రీ బర్డ్స్ షోడౌన్, ది డైలీ క్రాస్ వర్డ్స్, బ్రెయిన్ అవుట్ మరియు డైలీ సొలిటైర్ వంటి మరిన్ని గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.