YouTube బెస్ట్ వీడియో – వాచింగ్ అనుభవాన్ని అందించే ‘యుట్యూబ్ సిగ్నచెర్ డివైజ్’ ని ప్రకటించింది

YouTube బెస్ట్ వీడియో – వాచింగ్ అనుభవాన్ని అందించే ‘యుట్యూబ్  సిగ్నచెర్  డివైజ్’ ని ప్రకటించింది
HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9,కొత్తగా వచ్చిన ఈ డివైజ్ వన్ ప్లస్ ,షియోమీ మీ8 తో పాటుగా ప్రస్తుత తరం 18 స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ని రెండు భాగాలుగా చేస్తుంది.

యుట్యూబ్, నెక్స్ట్ – జెనరేషన్ సాంకేతికతలను, వీడియో పనితీరును మరియు విశ్వసనీయతను కలపడం ద్వారా "అత్యుత్తమ తరగతి యుట్యూబ్ అనుభవాన్ని" అందించగల 'యుట్యూబ్ సిగ్నచెర్  డివైజ్' అని పిలిచే స్మార్ట్ ఫోన్ల జాబితాను విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 ఈ జాబితాని కట్ చేయడానికి ఉపయోగపడే తాజా స్మార్ట్ ఫోన్ . సిగ్నేచర్ డివైజ్ తో, యూజర్లు HDR వీడియోలు, లీనమయ్యే 360-డిగ్రీ వీడియోలు మరియు వేగవంతమైన వీడియో లోడ్ సమయాన్నీ అనుభవించవచ్చు – తక్కువ బ్యాండ్ విడ్త్  ఉపయోగంతొ.

గూగుల్ యాజమాన్యంలోని వీడియో హోస్టింగ్ ప్లాట్ఫారమ్ ప్రకారం, ఒక ఫోన్  'యుట్యూబ్  సిగ్నచెర్  డివైజ్'  ఉండడం కోసం ఈ క్రింది ఫీచర్స్ కలిగి ఉండాలి.

హై డైనమిక్ రేంజ్ : హై డైనమిక్ రేంజ్ (HDR) కు తోడ్పాటుతో, వినియోగదారులు అత్యంత స్పష్టమైన రంగులతో వివరంగా ఉన్న వీడియోలను చూడగలరు. HDR సామర్థ్యాలు ఒక ఫోన్ ఎక్కువ కాంట్రాస్ట్ ని  ప్రదర్శించడానికి అనుమతిస్తాయి, తద్వారా వినియోగదారులు వీడియోల సవివరంగా చూడగలరు.

360 – డిగ్రీ వీడియో: ప్రాధమికంగా డివైజ్ల తెరపై నియంత్రణల ద్వారా లేదా VR హెడ్సెట్ ద్వారా అతుకులులేని అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించాలి.

4K డీకోడింగ్: కొన్ని డివైజ్ లు తమ తెరలపై 4K ను ప్రదర్శిస్తున్నప్పుడు, 4K డీకోడింగ్ వినియోగదారులు VR లో అధిక రిజల్యూషన్ మరియు స్పష్టతతో వీడియోలను చూస్తారని నిర్ధారిస్తుంది.

అధిక ఫ్రేమ్ రేటు: అధిక ఫ్రేమ్ రేట్ కు మద్దతు (సెకనుకు 60 ఫ్రేములు కంటే ఎక్కువ ఉన్నది) అనగా వినియోగదారులకు సూపర్ స్మూత్ క్లారిటీ వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది.

నెక్స్ట్ జెనరేషన్  కోడెక్స్ : ఈ మద్దతు ఉన్న డివైజ్లతో, వినియోగదారులు 30% తక్కువ బ్యాండ్ విడ్త్ వరకు ఉపయోగించి  YouTube లో అధిక రిజల్యూషన్ వీడియోలను చూడవచ్చు. 2019 సిగ్నేచర్ డివైజ్లు  VP9 ప్రొఫైల్ 2 డీకోడింగ్, ఆధునిక వీడియో కోడెక్ టెక్నాలజీ హార్డ్వేర్తో నిర్మించారు.

ప్రస్తుత 'యుట్యూబ్  సిగ్నచెర్  డివైజ్' లిస్ట్ మొత్తం: శామ్సంగ్ గెలాక్సీ నోట్  9, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 9, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 8, శామ్సంగ్ గెలాక్సీ నోట్  8, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 8, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 8 +, వన్ ప్లస్ 6, షియోమీ మి 8, షియోమీ మి మిక్స్ 2S, సోనీ ఎక్స్పీరియా XZ2: , సోనీ ఎక్స్పీరియా XZ2 ప్రీమియం, సోనీ ఎక్స్పీరియా XZ2 కాంపాక్ట్, హువావీ మాట్ 10 ప్రో, గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 XL, నోకియా 8 సిరోకో, LG V30 మరియు HTC U12 +

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo