మీ ఫోన్ లో ఈ లక్షణాలు కనిపిస్తే..హ్యాక్ అయినట్లే.!

Updated on 22-Jan-2023
HIGHLIGHTS

ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే మీ ఫోన్ హ్యాక్ జరిగినట్లుగా సందేహం వ్యక్తం చేయవచ్చు

కొత్త మార్పులు కనిపిస్తే మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది

మీ ఫోన్ లో అటువంటి సమస్య వుందా? అని మీకు డౌట్ రావచ్చు

మీ స్మార్ట్ ఫోన్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, మీ ఫోన్ హ్యాక్ జరిగినట్లుగా సందేహం వ్యక్తం చేయవచ్చు. మీ ఫోన్ లో కొన్ని కొత్త మార్పులు కనిపిస్తే, మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. నిజానికి, మీ ఫోన్ లో అటువంటి సమస్య వుందా? అని మీకు డౌట్ రావచ్చు. అందుకే, మీ ఫోన్ లో ఈ ఎటువంటి గుర్తులు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందో వివరంగా చూద్దాం.

టెక్నాలజీ పెరిగిన తరువాత ప్రతి విషయం చాలా సులభంగా మారాయి. ప్రజలు చాలా సులభంగా వారి పనులను వారి మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించడానికి అలవాటు పడిపోయారు. సరిగా ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తున్న కొందరు హ్యాకర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసే యాడ్స్ ను అడ్వార్టైజ్ చేయడం లేదా పర్సనల్ డేటాను చేజిక్కించు కోవడం వంటి అనైతిక పనులను చేస్తున్నారు.                     

మీ ఫోన్ లో సాధారంగా కాకుండా ఇక్కడ సూచించిన లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, మీరు మీ ఫోన్ గురించి అనుమానం వ్యక్తం చేయవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటో చూద్దామా.

ముందుగా, మీ హ్యాక్ అయినట్లయితే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా ఉంటుంది. అంటే, చాలా త్వరగా మీ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అలాగే, మీరు వాడకుండానే మీ డేటా అయిపోతుంది లేదా మీరు ఉపయోగించే డేటా కంటే అధికంగా డేటా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, బాగా వేగంగా పనిచేసే మీ ఫోన్ స్పీడ్ సడన్ గా పడిపోతుంది. అంటే, మీ ఫోన్ బాగా స్లో అయిపోతుంది. మీ ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ క్లోజ్ అవ్వడం, ఫోన్ దానంతట అదే Restart అవ్వడం వంటి లక్షణాలు లేదా గుర్తులు మీకు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు.

అయితే, ఈ లక్షణాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత మొబైల్ లలో చూసే సాధారణ సమస్యగా మీరు గుర్తించవచ్చు. అయితే, కొత్తగా తీసుకున్న లేటెస్ట్ ఫోన్లలో మీరు సమస్యలను గుర్తించినట్లయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు సందేహపడవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :