టెలికాం regulatory authority ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా ఇంటర్నెట్ packs validity విషయంలో కొన్ని మార్పులను చేసింది.
ప్రస్తుతం ఉన్న అన్ని నెట్ వర్క్స్ లోని ఇంటర్నెట్ ప్లాన్స్ మాక్సిమమ్ 90 రోజుల validity తో ఉన్నాయి. ఇక నుండి 365 రోజుల validity తో రానున్నాయి ఇంటర్నెట్ packs.
ఒక విధముగా ఇది చాలా ఇంపార్టెంట్ మార్పు అని చెప్పాలి. ఎందుకంటే దీని వలన ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా ఇంటర్నెట్ ఉంటుంది.
వయసు తో సంబంధం లేకుండా అమ్మా, నాన్నా, అక్కా ఇలా అందరి ఫోన్లలో ఇంటర్నెట్ ఆఫర్ అనేది ఉండటానికి అవకాశం ఇస్తుంది. సో డేటా మిగిలిపోతుంది, validity అయిపోతుంది అనే లిమిటేషన్స్ ఉండవు.
అయితే 365 days validity తో అందుబాటులో ఉండే prices లో ఆఫర్స్ లాంచ్ చేస్తేనే ఉపయోగకరం గా ఉంటుంది. కాని మరో వైపు ఇది టెలికాం నెట్ వర్క్స్ కు వెరీ బాడ్ న్యూస్.
నెట్ వర్క్స్ అన్ని validity లను 28 రోజులకు పెట్టె లాభాలు చూస్తున్నారు. అయితే TRAI ఈ amendment ను నోటిఫై చేసింది కాని ఇది వాస్తవ రూపంలో ఎప్పుడు వస్తుంది అనేదాని పై క్లారిటీ లేదు.