ఫేస్ బుక్ అఫీషియల్ గా కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది వీడియోస్ సెగ్మెంట్ లో. ఇది ఆండ్రాయిడ్ యాప్ పైనే పనిచేస్తుంది. డెస్క్ టాప్ లేదా ఆపిల్, విండోస్ లపై పనిచేయదు.
రెగ్యులర్ గా పోస్ట్ లను సేవ్ చేసుకున్నట్లు గానే, ఏదైనా వీడియో నచ్చితే దాని పైన రైట్ కార్నర్ లో ఉండే menu సింబల్ పై టాప్ చేసి వీడియో ను సేవ్ చేసుకోగలరు.
అయితే ఇలా సేవ్ చేసినది ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఆఫ్ లైన్ లో వీక్షించగలరు. మీరు చూసేసిన తరువాత దానిని రిమూవ్ చేయాలనుకుంటే వీడియో పై లాంగ్ ప్రెస్ చేసి unsave ఆప్షన్ ఎంచుకోగలరు.
ఇది గూగల్ Youtube కు పోటిగా లాంచ్ చేసినట్లు అనిపిస్తుంది. అయితే youtube ఆఫ్ లైన్ ఫీచర్ iOS అండ్ ఆండ్రాయిడ్ రెండింటిలోనూ అందుబాటులోకి తెచ్చింది.