Ghibli లాంటి కార్టూన్ ఫోటోలు ఉచితంగా క్రియేట్ చేసుకోండి..!

Ghibli లాంటి కార్టూన్ ఫోటోలు ఉచితంగా క్రియేట్ చేసుకోండి..!
HIGHLIGHTS

యానిమేటెడ్ కార్టూన్ ఇమేజ్ లు అందించే Ghibli స్టైల్ పోర్ట్రైట్ గురించే ఎక్కువగా వినిపిస్తోంది

Chat GPT-40 అప్డేట్ తో ఈ కొత్త ఫీచర్ వచ్చి చేరింది

ఫ్రీ మెంబర్స్ కి ఈ ఫీచర్ ఇప్పటి ఆమడదూరంలో నిలిచి పోయింది

ప్రస్తుతం సోషల్ మీడియాలో లేదా న్యూస్ ఎక్కడ చూసినా యానిమేటెడ్ కార్టూన్ ఇమేజ్ లు అందించే Ghibli స్టైల్ పోర్ట్రైట్ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. అంతగా, ఈ ఈ గిబిలి ఈ వారం రోజులో ప్రాచుర్యం పొందింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ Chat GPT-40 అప్డేట్ తో ఈ కొత్త ఫీచర్ వచ్చి చేరింది. ఈ ఫీచర్ తో యూజర్లు వారి యానిమేటెడ్ లేదా కార్టూన్ లాంటి ఇమేజ్ లతో ఇంటర్నెట్ ను ముంచెత్తారు. అయితే, ఈ ఫీచర్ చాట్ జీపీటీ ప్లస్, ప్రో మరియు టీమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, ఈ ఫీచర్ కేవలం కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్రీ మెంబర్స్ కి ఈ ఫీచర్ ఇప్పటి ఆమడదూరంలో నిలిచి పోయింది.

పైన తెలిపిన విషయం అంతా బాగానే వుంది మరి ఇలాంటి గిబిలీ లాంటి యానిమేటెడ్ ఇమేజ్ లను ఉచితంగా ఎలా లేదా ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. దీనికి కూడా ఒక మార్గం ఉంది. అదేమిటంటే, ఎలాన్ మస్క్ AI ప్లాట్ ఫామ్ Grok దీనికోసం మీకు సహాయం చేస్తుంది. గ్రోక్ AI ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్లు వారికి నచ్చిన విధంగా ఇమేజ్ లను రీ క్రియేట్ లేదా కొత్తగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు.

Also Read: iQOO Z10 5G: అతిపెద్ద బ్యాటరీ మరియు క్వాడ్ కర్వుడ్ AMOELD స్క్రీన్ తో లాంచ్ అవుతుంది.!

Ghibli లాంటి కార్టూన్ ఫోటోలు ఉచితంగా క్రియేట్ చేసుకోవాలి?

దీనికోసం ముందుగా Grok AI వెబ్సైట్ ను ఓపెన్ చేసి మీ మెయిల్ ఐడి తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ తర్వాత గ్రోక్ AI చాట్ బాక్స్ లో మీరు కోరుకునే ఇమేజ్ ను యాడ్ చేయాలి. బాక్స్ పక్కన కనిపించే ఫైల్ అటాచ్ మెంట్ పై నొక్కడం ద్వారా ఈ పని చేయవచ్చు. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇమేజ్ ను మీరు ఏవిధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ప్రాంప్ట్ ఇవ్వాలి. ఒక వేల మీరు ఈ ఇమేజ్ ను కార్టూన్ ఇమేజ్ గా మార్చాలనుకుంటే దానికి తగిన ప్రాంప్ట్ ను ఇవ్వాలి. అంతే, గ్రోక్ మీరు కోరుకున్న ఇమేజ్ ను పూర్తిగా గిబిలీ స్టయిల్ పోర్ట్రైట్ ఇమేజ్ ను మీకు అందిస్తుంది.

గ్రోక్ ఫ్రీ మెంబర్స్ కు కూడా ఈ ఫెసిలిటీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, కోరనుకునే ఇమేజ్ ను కూడా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం తగిన ప్రాంప్టు ను ఇవ్వాల్సి ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం మీ కార్టూన్ లేదా యానిమేటెడ్ ఇమేజ్ ను ఉచితంగా క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo