ఫాస్ట్ ప్రోసెసర్, స్మార్ట్ పెన్ తో వస్తున్న షియోమి ప్యాడ్ 6.!
జూన్ 13 న షియోమి ప్యాడ్ 6 భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది
హై ఎండ్ ఫీచర్లతో తీసుకు రాబోతున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది
Xioami Pad 6 ని దీనికి ముందుగా వచ్చిన ప్యాడ్ 5 కి తరువాతి తరం ప్యాడ్ గా తీసుకు వస్తోంది
జూన్ 13 న షియోమి ప్యాడ్ 6 ను భారతీయ మార్కెట్ లో లాంచ్ చెయ్యడానికి సర్వం సిద్ధం చేసింది షియోమి. ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను షియోమి వేగవతమైన క్వాల్కమ్ ప్రాసెసర్, వీడియో మరియు ఆడియో పరంగా Dolby సపోర్ట్ మరియు స్మార్ట్ పెన్ వంటి హై ఎండ్ ఫీచర్లతో తీసుకు రాబోతున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది. Xioami Pad 6 గురించి షియోమి తెలిపిన టీజ్డ్ స్పెక్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దాం.
Xioami Pad 6: కీలకమైన స్పెక్స్
Xioami Pad 6 ని దీనికి ముందుగా వచ్చిన ప్యాడ్ 5 కి తరువాతి తరం ప్యాడ్ గా తీసుకు వస్తోంది. ప్యాడ్ 5 స్నాప్ డ్రాగన్ 860 ప్రోసెసర్ తో తీసుకు రాగా, Xioami Pad 6 ను క్వాల్కమ్ Snapdragon 870 ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ప్యాడ్ కేవలం 6.51mm కొలతతో చాలా స్లీక్ గా మరియు 490 గ్రా బరువుతో తేలికగా ఉంటుందని కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
ప్యాడ్ 5 కూడా క్వాడ్ స్పీకర్లతో Dolby Atmos మరియు 2K రిజల్యూషన్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన బిగ్ డిస్ప్లే తో వచ్చింది. షియోమి ప్యాడ్ 6 కూడా Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తున్నట్లు షియోమి తెలిపింది. ప్యాడ్ 5 లో సింగిల్ రియర్ ఉండగా, ప్యాడ్ 6 లో మాత్రం 13MP డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ముఖ్యంగా, ఈ అప్ కమింగ్ షియోమీ ప్యాడ్ లో Xiaomi Smart Pen ఉన్నట్లు గొప్పగా చెబుతోంది షియోమి.