షియోమి ఇండియాలో కొత్త ప్యాడ్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్యాడ్ ను Xioami Pad 6 పేరుతో స్మార్ట్ పెన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను జూన్ 13వ తేదీన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ మెంట్ చేయడంతో పాటుగా టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఈ షియోమి ప్యాడ్ 6 అమెజాన్ స్పెషల్ గా వస్తోంది మరియు ఈ ప్యాడ్ కోసం అమెజాన్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ మరియు బ్యానర్ పేజ్ ను కూడా అందించింది.
షియోమి ఈ అప్ కమింగ్ ప్యాడ్ Xioami Pad 6 యొక్క కీలకమైన వివరాలను కూడా టీజింగ్ ద్వారా అందించింది. Xioami Pad 6 ను క్వాల్కమ్ యొక్క ఫాస్ట్ 5G ప్రోసెసర్ Snapdragon 870 SoC తో తీసుకు వస్తునట్లు షియోమి తెలిపింది. ఈ షియోమి ప్యాడ్ 6 చాలా సన్నగా మరియు తేలికగా ఉన్నట్లు మరియు కొలతలను కూడా రివీల్ చేసింది. ఈ ప్యాడ్ 6.51mm మందంతో చాలా సన్నగా మరియు 490 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని కంపెనీ టీజింగ్ ద్వారా సూచించింది.
ఈ షియోమి ప్యాడ్ యొక్క మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్యాడ్ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తోందని కూడా షియోమి ప్రకటించింది. ఇందులో Xiaomi Smart Pen ఉన్నట్లు కూడా టీజింగ్ ఇమేజ్ ద్వారా తెలిపింది.