ఈ రోజు xiaomi రెండు ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. అందులో ఒకటి 60 in Mi టీవీ 3 మరొకటి రెండు చక్రాలు కలిగిన సెల్ఫ్ బ్యాలన్సింగ్ ద్విచక్ర వాహనం.
ముందుగా టీవీ..
దీని పేరు Mi టీవీ 3. ధర 51,000 రూ సుమారు. చైనా లో రిలీజ్ అయిన టీవీ, నవంబర్ 3 నుండి చైనా లో సేల్స్ స్టార్ట్ అవుతాయి.
ఇది 60 in స్క్రీన్ పరిమాణం తో వస్తుంది. 4K రిసల్యుషణ్. 3840 x 2160 పిక్సెల్స్ డిస్ప్లే.MEMC మోషన్ అండ్ కలర్ gamut వంటి ఫీచర్స్ తో తయారు చేయబడింది.
చుట్టూ అల్యూమినియం మెటల్ ఫ్రేమింగ్ తో మెటల్ బ్యాక్ కవర్ తో Mi టీవీ 11.6mm thin బాడీ తో ఉంది. ఇది ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది అనే విషయం పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు xiaomi.
Ninebot మిని స్కూటర్..
దీనితో xiaomi 2 వీలర్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది అనుకోవాలి. చైనా లోని రోబోటిక్స్ కంపెనితో కలిసి xiaomi దీనిని రూపోందించింది.
ఇది బ్యాటరీ ఎలెక్ట్రిక్ పవర్ తో నడిచే సెల్ఫ్ బ్యాలన్సింగ్ వెహికల్. ధర – 20,500 రూ. సుమారు. దీని బాడీ ఏరో స్పేస్ గ్రేడ్ మగ్నిసియం alloy తో ఉంటుంది. బరువు 13 కిలో గ్రా.
ఇది గంటకు 16 km ల వేగంతో వెళ్తుంది. దీనితో పాటు వచ్చే బ్యాటరీస్ ఒకసారి రిచర్జ్ చేస్తే, మిని స్కూటర్ ను 22 కిలోమీటర్ల వరకూ రన్ చేస్తాయి.
స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో కంట్రోల్ చేయగలిగే ninebot మిని స్కూటర్ 15 డిగ్రీల వరకూ ఉండే ఎత్తులు కూడా ఎక్కగలదు. దీనిని కాళ్ళతో స్టిరింగ్ చేస్తే నడుస్తుంది.
ఈ రెండూ కాకుండా టీవీ కోసం xiaomi Mi సబ్ వూఫార్(6,100 రూ), బ్లూటూత్ వాయిస్ రిమోట్ కంట్రోల్ ( 1,000 రూ) మరియు mi టీవీ మెయిన్ బోర్డ్(10,000 రూ) లాంచ్ అయ్యాయి.
మెయిన్ బోర్డ్ ద్వారా రెగ్యులర్ టీవీ లను కూడా స్మార్ట్ టీవీ ల గా కన్వర్ట్ చేసుకోవటానికి అవతుంది. ఇది డాల్బీ సరౌండ్ సౌండ్ స్పీకర్స్ తో వస్తుంది.
ఇమేజ్ ఆధారం: MIUI