Xiaomi Pad 7: 3.2K పవర్ ఫుల్ డిస్ప్లే మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
Xiaomi Pad 7 ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది
ఈ ప్యాడ్ ను 3.2K పవర్ ఫుల్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది
ప్యాడ్ 7 Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది
Xiaomi Pad 7 ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్యాడ్ ను 3.2K పవర్ ఫుల్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది. ముందుగా చైనా మార్కెట్లో విడుదలైన ఈ ప్యాడ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెట్టింది. ఈ ప్యాడ్ ప్రైస్, స్పెక్స్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Xiaomi Pad 7: ధర
షియోమీ ప్యాడ్ 7 రెండు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లలో వచ్చింది. ఈ ప్యాడ్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ని రూ. 27,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ హాయ్ ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ని రూ. 30,999 ధరతో ప్రవేశపెట్టింది.
ప్యాడ్ 7 జనవరి 13 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. షియోమీ ప్యాడ్ 7 గ్రాఫైట్ గ్రే, మిరాజ్ పర్పల్ మరియు సేజ్ గ్రీన్ మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ప్యాడ్ 7 అమెజాన్ మరియు xiaomi.com నుంచి లభిస్తుంది.
Xiaomi Pad 7: ఫీచర్స్
షియోమీ ప్యాడ్ 7 ను 11.2 ఇంచ్ LCD స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇది 3.5K (3200 x 2136) రిజల్యూషన్, 144Hz షింక్ రిఫ్రెష్ రేట్ మరియు 800 (HBM) నిట్స్ బ్రైట్నెస్ 12-bit స్క్రీన్. ఈ ప్యాడ్ Dolby Vision మరియు P3 వైడ్ కలర్ గాముట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ప్యాడ్ Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 12GB LPDDR5X RAM ర్యామ్ మరియు 256GB (UFS 4.0) స్టోరేజ్ సపోర్ట్ ఉంటాయి.
షియోమీ ప్యాడ్ 7 పూర్తిగా మెటల్ తో డిజైన్ చేయబడింది మరియు వెనుక 13MP మెయిన్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది ప్యాడ్ 4K వీడియో రికార్డ్ కి సపోర్ట్ చేస్తుంది మరియు మంచి వీడియో కాలింగ్ సౌలభ్యం తో వస్తుంది.
ప్యాడ్ 7 లో 8850 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఈ ప్యాడ్ 45W టర్బో ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ప్యాడ్ 7 లో క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos టెక్నాలజీతో జతగా వస్తుంది. ప్యాడ్ 7 ను ఫోకస్ కీబోర్డ్ మరియు ఫోకస్ పెన్ సపోర్ట్ తో అందించింది. ఈ రెండిటి సహాయంతో ఈ ప్యాడ్ ను ల్యాప్ టాప్ మాదిరిగా మార్చుకునే అవకాశం అందించింది. అయితే, ఈ రెండు ప్రొడక్ట్స్ ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Also Read: Toshiba 55 ఇంచ్ QLED Tv పై భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన Amazon
ఫోకస్ కీబోర్డ్ ను రూ. 8,999 రూపాయల ధరతో అందించింది. ఈ కీబోర్డ్ అడాప్టివ్ బ్యాక్ లిట్ మరియు మంచి స్పేస్ కలిగిన కీ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది 0 నుంచి 124 డిగ్రీల మధ్యలో మల్టీ లెవల్ సర్దుబాటు తో PC లెవల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని షియోమీ చెబుతోంది.