Xiaomi Pad 7 ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన షియోమీ.!

Xiaomi Pad 7 ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన షియోమీ.!
HIGHLIGHTS

Xiaomi Pad 7 ఇండియా లాంచ్ డేట్ ని షియోమీ ఫిక్స్ చేసింది

ఈ ప్యాడ్ ను కీబోర్డ్ మరియు స్టయిల్స్ పెన్ తో జత లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్

Redmi 14C మరియు షియోమీ ప్యాడ్ 7 లను విడుదల చేయడానికి డేట్స్ అనౌన్స్ చేసింది

Xiaomi Pad 7 ఇండియా లాంచ్ డేట్ ని షియోమీ ఫిక్స్ చేసింది. ముందుగా చైనాలో విడుదల చేసిన ఈ ప్యాడ్ 7 ను ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ప్యాడ్ ను కీబోర్డ్ మరియు స్టయిల్స్ పెన్ తో జత లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ఇమేజ్ లను ద్వారా అర్థం అవుతోంది. అంటే, త్వరలోనే Redmi 14C స్మార్ట్ ఫోన్ మరియు షియోమీ ప్యాడ్ 7 లను షియోమీ విడుదల చేయడానికి డేట్స్ అనౌన్స్ చేసింది.

Xiaomi Pad 7 : లాంచ్

షియోమీ ప్యాడ్ 7 ను జనవరి 10వ తేదీ ఇండియాలో చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను సరికొత్త కీప్యాడ్ మరియు స్టయిల్స్ పెన్ తో తీసుకువస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను వచ్చే వారాంతంలో లాంచ్ చేస్తుంది. వాస్తవానికి, వచ్చే వారం ప్రారంభంలో రెడ్ మీ బడ్జెట్ ఫోన్ Redmi 14C 5G ను మరియు వారాంతంలో ప్యాడ్ 7 ను షియోమీ లాంచ్ చేస్తోంది.

Xiaomi Pad 7 Launch

Xiaomi Pad 7 : ఫీచర్స్ (చైనా)

షియోమీ ప్యాడ్ 7 ను ముందుగా చియాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ప్యాడ్ ను ఇండియాలో కూడా విడుదల చేస్తోంది. అయితే, ఇండియాలో కూడా అదే ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందో లేదో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే, చైనా మార్కెట్ లో ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ మరియు ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది.

షియోమీ ప్యాడ్ 7 సిరీస్ ను కొత్త ఫ్లోటింగ్ కీబోర్డు మరియు స్టయిల్స్ పెన్ సెట్ తో అందించింది. అంతేకాదు, ఇది రెగ్యులర్, స్టయిల్స్ మరియు పూర్తి సెట్ మూడు ఆప్షన్లతో అందించింది. అయితే, ఇండియన్ మార్కెట్ లో ఎలా అందిస్తుందో చూడాలి.

Also Read: Boult x Mustang సిరీస్ TWS Buds పై ప్రత్యేకమైన ఆఫర్లు అందుకోండి.!

అంచనా ఫీచర్స్ :

ప్యాడ్ 7 చైనా వేరియంట్ 11.2 ఇంచ్ LCD స్క్రీన్ ను 3.2K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఇండియాలో కూడా ఇదే స్క్రీన్ స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ ప్యాడ్ ను Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ మరియు ఆండ్రాయిడ్ 15 తో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ అప్ కమింగ్ ప్యాడ్ లో 13MP రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. డిడ్ కాకుండా ఈ ప్యాడ్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 8,850 mAh బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉండవచ్చు.

ఈ ప్యాడ్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి షియోమీ ఈ ప్యాడ్ కీలకమైన ఫీచర్స్ త్వరలోనే అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo