Mi Air Purifier 2 :
ఇండియాలో Xiaomi Mi Air Purifier 2 మరియు Mi Band 2 ను లాంచ్ చేసింది. Mi ఎయిర్ purifier మీ చుట్టూ ఉన్న గాలిలో ఉండే పొల్యూషన్ ను క్లిన్ చేస్తుంది. దీని ప్రైస్ 9,999 రూ.
దీనిని కంట్రోల్ చేయటానికి Mi Home యాప్ కూడా ఉంటుంది. ఎయిర్ purifier లో ఫిల్టర్స్ ఉంటాయి వాటర్ ఫిల్టర్ లానే. వీటి లై ఫ్ ను కూడా చెక్ చేసుకోగలరు యాప్ లో.
దీనిలో క్లీన్ ఎయిర్ డెలివరి రేట్(CADR) 310 cubic మీటర్స్ ఉంది. 360 డిగ్రీ ఎయిర్ intake మరియు EPA ఫిల్టర్ ఉన్నాయి లోపల. ఇవి airbone పార్టికల్స్ ను remove చేయటానికి ట్రిపుల్ లేయర్ డిజైన్ తో పనిచేస్తాయి.
Activated కార్బన్ ఫిల్టర్ అనేది చెడు వాసనలు రాకుండా చేయటానికి అమర్చబడింది లోపల.కంపెని చెప్పే దాని ప్రకారం 10 నిమిషాల్లో 21 స్క్వేర్ మీటర్ సైజ్ గల ప్రదేశంలో ఎయిర్ ను purify చేయగలదు Mi Air Purifier.
సెప్టెంబర్ 26 నుండి Mi.com సైట్ లో సేల్స్ మొదలు. అక్టోబర్ 2 నుండి ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యూచర్ లో ఫిల్టర్స్ ను రీప్లేస్ చేయవలసి వస్తే అవి కూడా అమ్ముతుంది ఆన్ లైన్ లో ఫిల్టర్ ప్రైస్ 2,999 రూ.
MiBand 2:
దీని ప్రైస్ 1,999 రూ. ఇది గతంలో లాంచ్ అయిన Mi Band కు అప్ గ్రేడ్ మోడల్. ఈ కొత్త బ్యాండ్ లో OLED డిస్ప్లే ఉంది. 20 రోజుల బ్యాటరీ బ్యాక్ అప్.
చేయి ని లిఫ్ట్ చేస్తే ఆటోమాటిక్ గా టైం చూపిస్తుంది. డిస్ప్లే పై టాప్ చేస్తే స్టెప్స్, హార్డ్ రేట్ చూపిస్తుంది. ఇది IP67 splash రెసిస్టన్స్ తో వస్తుంది. అంటే కంప్లీట్ గా వాటర్ కాదు కాని కొద్ది పాటి వాటర్ జల్లులు పడినా ఫర్వాలేదు.
ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ OS నుండి మొదలై దాని తరువాత వెర్షన్ OS ల పై రన్ అయ్యే ఫోనులకు బ్యాండ్ దగ్గరిలోకి వెళితే ఫోన్ ను unlock చేయగలదు.
హెల్త్ activities తో పాటుగా అలారం, ఫోన్ నోటిఫికేషన్స్ ఫర్ incoming కాల్స్, యాప్స్ ను కూడా చూపిస్తుంది. Mi.com లో సెప్టెంబర్ 27 నుండి సేల్స్. సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ లో సెల్ అవనుంది.