షియోమి ఇండియాలో మల్టీ ప్రోడక్ట్స్ ను లాంచ్ చెయ్యడానికి డేట్ సెట్ చేసింది. ఆగష్టు 1న భారతీయ మార్కెట్ లో Redmi 12, Watch 3 మరియు స్మార్ట్ టీవీ లను ఒకేసారి లాంచ్ చేస్తున్నట్లు షియోమి అనౌన్స్ చెయ్యడంతో పాటు టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఈ లాంచ్ కార్యక్రమం నుండి లాంచ్ అయ్యే వాటిలో 5G స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ మరియు స్మార్ట్ టీవీలు ఉన్నాయి. షియోమి లాంచ్ చేయబోతున్న ఆ మల్టీ ప్రోడక్ట్స్ మరియు వాటి వివరాలు చూద్దామా.
ముందుగా స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడితే, Redmi 12 స్మార్ట్ ఫోన్ లను ఆగష్టు 1న లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కీలకమైన వివరాలను కూడా కంపెనీ టీజింగ్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ లో 50MP కెమేరాని Flim Filters తో జత చేసినట్లు టీజర్ లో తెలిపింది. దీనితో పాటుగా, 8GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఆలాగే, 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోన్లో ఉంటుంది.
ఇక రెండవ ప్రోడక్ట్ విషయానికి వస్తే, Redmi Watch 3 Active ని కూడా ఈ ఈవెంట్ నుండి లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మూడు కలర్స్ అప్షన్ లలో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ప్రీమియం మెటాలిక్ ఫినిష్, Bluetooth 5.3 సపోర్ట్ తో కాలింగ్, 12 డేస్ బ్యాటరీ మరియు 100 పైగా స్పోర్ట్స్ మోడ్స్ తో పాటుగా 200 పైగా వాచ్ ఫేస్ లను కలిగి ఉంటుందని టీజర్ ద్వారా ప్రకటించింది.
ఇదే రోజు Xiaomi smart tv Xseries నుండి కొత్త స్మార్ట్ టీవీ ని కొద లాంచ్ చేస్తోంది. ఈ టీవీ కోసం అందించిన టీజర్ ఇమేజ్ లో టీవీ సన్నని అంచులను కలిగి ఉన్నట్లు బిగ్ ఆడియో తో వస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిపింది.
ముందుగా ఫోన్ తో టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ ఇప్పుడు ప్రోడక్ట్స్ మరియు వాటి కీలకమైన వివరాలను కూడా ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలు పెట్టింది. లాంచ్ నాటిని మరిన్ని కీలకమైన వివరాలను వెల్లడించే అవకాశం వుంది.