షావోమి మి కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 ఇండియాలో విడుదలైనది రూ . 799 ధరతో

Updated on 04-Oct-2018
HIGHLIGHTS

ఈ బ్లూటూత్ స్పీకర్ 6 గంటల ప్లే బ్యాక్ అందిస్తుందని షావోమి పేర్కొంది, మరియు ఇది హాండ్స్ ఫ్రీ క్లింగ్ కోసం అంతర్గత మైక్ తో వస్తుంది.

షావోమి తన  మి కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 ను భారతదేశంలో రూ .799 ధరతో ప్రారంభించింది. ఈ స్పీకర్ సంస్థ యొక్క అధికారిక స్టోర్ Mi.com లో జాబితా ఇది  చేయబడింది. ఈ లిస్టింగ్ ప్రకారం, ఇన్ కమింగ్ కాల్స్ ను వినియోగదారులు అనుమతించడానికి పవర్ బటన్ నోకాల్సివుంటుంది, ఈ స్పీకర్లో అంతర్నిర్మిత మైక్రోఫోన్ ఉంది. దీని వాల్యూమ్ 80 శాతం వద్ద ఉంచికూడా, ఈ స్పీకర్ ఆరు గంటల బ్యాటరీ జీవితాన్ని అందించగలదని  షావోమి పేర్కొంది.

ఈ బ్లూటూత్ స్పీకర్, బ్లూటూత్ వెర్షన్ 4.2 మరియు 10 మీటర్ల దూరం వరకు కనెక్టువిటీతో వస్తుంది. స్పీకర్ యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ పరిధి 200Hz నుండి 18kHz మధ్య ఉంటుంది మరియు ఇది 480mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మైక్రో- USB పోర్ట్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేయబడుతుంది, అయితే, దీని బాక్స్ లో USB ఛార్జింగ్ కేబుల్ ని  షావోమి ఇవ్వలేదు. ఈ స్పీకర్ ఒకే రకమైన బటన్ను కలిగి ఉంది, బ్లూటూత్ జతచేయడం, ప్లేయింగ్ / మ్యూజిక్ పాజ్, కాల్స్ కి స్పందించడం  మరియు తిరస్కరించడం మరియు ఫ్యాక్టరీ సెట్టింగులను పునరుద్ధరించడం వంటివి ఇందులో ఉన్నాయి.

షావోమి భారతదేశం లో తన ప్రొడక్టుల మీద ధర తగ్గించిన ఒక వారం తరువాత నుండి అభివృద్ధి కనబడుతుంది.  ఈ చైనీస్ టెక్ దిగ్గజం,  మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది, 55 అంగుళాల Mi LED TV 4 Pro, 49-అంగుళాల Mi LED TV 4A Pro మరియు 32-అంగుళాల MI LED TV 4C Pro. అలాగే, మి బ్యాండ్ 3, దాని మి హోమ్ 360 డిగ్రీల సెక్యూరిటీ కెమెరా, మి ఎయిర్ ప్యూరిఫయర్ 2 ఎస్ మరియు మి లగేజ్ యొక్క రెండు మోడళ్లను కూడా ప్రారంభించింది. జూన్లో, సంస్థ Mi పాకెట్ స్పీకర్ 2 ను 5W స్పీకర్ డ్రైవర్తో ప్రారంభించింది, ఇది జర్మన్ ఆడియో ఇంజనీరింగ్ సంస్థ టాంఫనీ తయారు చేసింది. వైర్లెస్ స్పీకర్ బ్లూటూత్ 4.1 కి మద్దతు ఇస్తుంది మరియు 1200mAh యూనిట్తో వస్తుంది, ఇది కంపెనీ వాదనల ప్రకారం, 7 గంటల వరకు నిరంతరాయంగా సంగీత ప్లేబ్యాక్  ఇస్తుందని చెబుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :