Xiaomi HyperOS ముందుగా అందుకోనున్న ఫోన్ల లిస్ట్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
Xiaomi HyperOS కోసం అనువైన పరికరాల వివరాలను అందించింది
షియోమి ఇప్పుడు కొత్త అప్డేట్ ను తీసుకు వస్తోంది
2024 మొదటి క్వాటర్ లో విడుదల చేస్తున్నట్లు ప్లాన్ విడుదల చేసింది
ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమి, కొత్త యూజర్ ఇంటర్ ఫెజ్ Xiaomi HyperOS కోసం అనువైన పరికరాల వివరాలను అందించింది.ప్రారంభం నుండి MIUI యూజర్ ఇంటర్ ఫెజ్ ను ఉయోగిస్తున్న షియోమి ఇప్పుడు కొత్త అప్డేట్ ను తీసుకు వస్తోంది. ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను యూజర్ కు మరింత అనువైన సర్వీస్ మరియు ఉపయోగాలను అందించే విధంగా తీసుకు వస్తునట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త అప్డేట్ ను ప్రపంచ వ్యాప్తంగా (globally) విడుదల చేయనునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.
Xiaomi HyperOS
షియోమి కొత్త హైపర్ ఓఎస్ ను 2024 మొదటి క్వాటర్ లో విడుదల చేస్తున్నట్లు ప్లాన్ విడుదల చేసింది. దీని ప్రకారం, Q1 2024 లో లేటెస్ట్ షియోమీ, రెడ్ మి మరియు పోకో స్మార్ట్ ఫోన్ లలో కొన్ని ఫోన్ లు ఈ అప్డేట్ ను అందుకుంటాయని తెలిపింది. షియోమి ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను అన్ని పర్సనల్ డివైజెస్ కనెక్టివిటీ కి అనుగుణంగా హ్యూమన్ సెంట్రిక్ గా తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
ఈ అప్ కమింగ్ సిరీస్ అయిన షియోమి 14 సిరీస్ ఈ కొత్త హైపర్ ఓఎస్ ప్రీ ఇన్స్టాల్ తో వస్తాయని కూడా తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ ను ముందుగా అందుకోనున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అనౌన్స్ చేసింది.
Also Read : భారీ కెమేరా సెటప్ గల vivo X100 Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్న వివో.!
హైపర్ ఓఎస్ ముందుగా అందుకోనున్న స్మార్ట్ ఫోన్స్
ఇక హైపర్ ఓఎస్ ముందుగా అందుకోనున్న స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే, షియోమి 13 అల్ట్రా, షియోమి 13 ప్రో, షియోమి 13, షియోమి 13T ప్రో, షియోమి 13T, రెడ్ మి నోట్ 12, రెడ్ మి నోట్ 12S, షియోమి ప్యాడ్ 6 మరియు పోకో F5 స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.