Xiaomi కంపెని తయారు చేసే ప్రొడక్ట్స్ లో మరొక ఐటెం యాడ్ అయ్యింది. బ్లూ టూత్ హెడ్ సెట్. ఇది వాటర్ IPX4 resistant తో వస్తూ రన్నింగ్, జాగింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీస్ లో పట్టే చెమట నుండి సురక్షితంగా ఉండేలా తయారు అయ్యాయి.
చైనా లో రిలీజ్ అయిన వీటి ప్రైస్ సుమారు 1,500 రూ ఇండియన్ కరెన్సీ లో. నవంబర్ 11 నుండి చైనాలో సేల్స్ మొదలు. ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.
దీని పేరు Xiaomi Mi స్పోర్ట్స్ బ్లూ టూత్ హెడ్ సెట్. ఇది బ్లూ టూత్ 4.1 వెర్షన్ తో పనిచేస్తుంది. ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఒకే సారి రెండు డివైజ్ లకు కనెక్ట్ అవగలదు.
లోపల 110mah బ్యాటరీ ఉంది. కంపెని లెక్కలు ప్రకారం ఇది 7 గంటలు పాటు బ్యాక్ అప్ ఇస్తుంది. చార్జింగ్ అయిపోతే చార్జింగ్ పెట్టుకునే వరకూ ఇవి పనిచేయవు.
డిజైన్: in-ear కాన్సెప్ట్ అండ్ చెవి చుట్టూ తగిలించుకుకోవటానికి క్లిప్ వస్తుంది. జనరల్ గా ఈ డిజైన్ ఫిట్ గా ఉండేలా క్రిందకు జారకుండా ఉంచటానికి ఉంటుంది.
వీటితో పాటు కంపెని 5 డిఫరెంట్ ear caps ఇస్తుంది. ఇవి వివిధ రకాల చెవి సైజ్లకు ఫిట్ అయ్యేలా ఉపయోగపడతాయి.